Bigg Boss Lahari హాట్ లుక్స్ తో కుర్రాళ్ళ హీట్ పెంచుతున్న… బిగ్ బాస్ బ్యూటీ లహరి

Jaya Kumar

Bigg Boss Lahari బిగ్ బాస్ సీజన్ 5 19 మంది కంటెస్టెంట్స్ పాల్గొన‌గా… తనదైన శైలిలో అందరి మనసులు దోచుకున్న బ్యూటీ లహరి. పలు కారణాల వల్ల హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక కూడా తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతుంది ఈ భామ. బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో లేడీ అర్జున్‌రెడ్డి ఎవరు అంటే చాలామంది లహరి షారి వైపు వేలు చూపిస్తారు. తనతో పెట్టుకున్నవాళ్లకు చుక్కలు చూపిస్తుందీ ఈ అమ్మడు.

సారీ నాకు పెళ్లైంది, అర్జున్‌రెడ్డి, జాంబిరెడ్డి చిత్రాల్లో నటించిన ఈ భామకు ఇండస్ట్రీలో అనుకున్నంత గుర్తింపు రాలేదు. దీంతో బిగ్‌బాస్‌ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలనుకుంది. కానీ అదృష్టం అడ్డం తిరగడంతో తొంద‌ర‌గానే బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. అయితే త‌న సోష‌ల్ మీడియా ద్వారా తన ఫోటో లను షేర్ చేస్తూ మంచి ఫాలోయింగ్ పెంచుకుంటుంది. ఈమె ఫోటోలకు నెటిజన్లు ఫిదా అవుతూ… ఫోటోలకు వేలల్లో లైక్స్ ఇస్తున్నారు.

తాజాగా ఒక ఫోల్క్ కవర్ సాంగ్ లో నటించింది లహరి. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

- Advertisement -