Bigg Boss Non Stop: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అషు రెడ్డి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియా టిక్ టాక్ రీల్స్ ద్వారా సాగిన ఈ ముద్దుగుమ్మ ప్రయాణం బిగ్ బాస్ వరకూ వెళ్ళింది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే అడపాదడపా కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది అషు.
ఇక అషు ప్రస్తుతం రెండు సినిమాల్లో కూడా నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ అమ్మడు చేసే హడావిడికి అల్ట్రా సెలబ్రిటీలు సైతం జలసీ గా ఫీల్ అవ్వాల్సిందే. మొత్తానికి అషు టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఓ వెలుగు వెలుగుతుంది. ఇంట్లో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండే ఈ భామ..
ఎప్పటికప్పుడు తన హాట్ అందాలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఆరబోస్తుంది. ఇక ఈ క్రమంలోనే బోల్డ్ బ్యూటీ గా ఒక టాగ్ ను కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఓటీటీ వెర్షన్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షో లో ఈ అమ్మడు ఎంపికైన సంగతి మనకు తెలుసు.

Bigg Boss Non Stop: అషు కి అంత సీన్ ఉంది అని చెప్పడానికి కారణం ఇదే!
ఎలాగైనా టైటిల్ ను సొంతం చేసుకోవాలనే ఆలోచనలో డైలీ ఏదో ఒక బోల్డ్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. ఇక డ్రెస్సింగ్ విషయంలో మరో లెవెల్ అనిపించుకున్న ఈ అమ్మడు. తాజాగా హౌస్ లో కట్టిన చీర బాగా ట్రెండ్ అవుతుంది. బ్లాక్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ లో ఈ ముద్దుగుమ్మ తొడిగిన చీర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
అంతేకాకుండా అవుటాఫ్ స్టాక్ అంటూ ఆ చీరలు స్టాక్ లేకుండా కొనేస్తున్నారు. ఇక అంతే కాకుండా ఆ చీర డిజైన్ చేసిన వాళ్ళు స్టాక్ పరిమితమని సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు.