Bigg Boss Season 5 బిగ్ బాస్ సీజన్ 5 రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియ రసవత్తరంగా జరనున్నట్లు తెలుస్తోంది. నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా… ఇందులో ఎలిమినేషన్ ప్రక్రియకు సంబంధించి కంటెస్టెంట్ లు మాట్లాడుకోవడం మనం గమనించవచ్చు. ఈ నేపధ్యం లోనే వారి మధ్య వాడి వేడిగా సంభాషణలు జరిగినట్లు చూడొచ్చు.

ఈ ప్రోమోలో ఎలిమినేషన్ ప్రక్రియ లో భాగంగా ఇంట్లోని సభ్యులను రెండు గ్రూపులుగా విడిపోవాలని బిగ్ బాస్ ఆదేశిస్తారు. అనంతరం శ్వేతా వర్మ ఫుల్ గా ఫైర్ అయినట్లు కనిపిస్తుంది. లోబో, కాజల్, హమీద లకు… ఓ రేంజ్ లో ఇచ్చిపడేసినట్లు కనిపిస్తుంది. శ్వేతా వర్మ ఇంతలా రియాక్ట్ అవ్వడం పట్ల ఇంట్లోని సభ్యులతో పాటు, ప్రేక్షకులు కూడా షాక్ కి గురవుతున్నారు. అదే విధంగా విశ్వ కూడా… ఉమాదేవి ని నామినెటే చేస్తుండగా… అందుకు బదులుగా ఆమె అనకూడని మాట ఏదో అన్నట్టు తెలుస్తోంది. దీంతో షన్ను కూడా ఒక్కసారిగా షాక్ అయినట్టు మనం చూడొచ్చు.
https://youtu.be/xoOKHRZNEJc

ఈ రోజు ఎపిసోడ్ మాత్రం మంచి రంజుగా ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. అయితే రెండో వారంలో ఎలిమినేషన్ లిస్ట్ లో ఉన్న సభ్యులు వీరేనంటూ పలు వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. వారిలో ఉమాదేవీ, యానీ మాస్టర్, నటరాజ్ మాస్టర్ , ప్రియాంక సింగ్, ప్రియ, ఆర్జే కాజల్, లోబోలు నామినేషన్‌లోకి వచ్చినట్టు సమాచారం. ఈ వార్తలు నిజమో, కాదో తెలుసుకోవాలంటే మరికొన్ని గంటలు ఆగక తప్పదు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Jaya Kumar

Hello All, This is Jaya Kumar an enthusiastic writer, I have completed my Journalism & Mass Communications from Acharya Nagarjuna University, Previously worked for ETV Andhra Pradesh & Public Vibe,...

Mail

Published on సెప్టెంబర్ 13, 2021 at 5:19 సా.