Bigg Boss బిగ్ బాస్ సీజన్ 5 … ఈసారి 5 మచ్ ఎంటర్ టైన్మెంట్ గ్యారంటీ అంటూ కొనసాగుతూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ నేపధ్యం లోనే మొదటి వారం ఎలిమినేషన్ తర్వాత నుంచి బిగ్ బాస్ షో లోని కంటెస్టెంట్ లు ఒకింత తమ పంథాను మార్చినట్లు కనిపిస్తుంది. పది రోజులు గడుస్తున్న నేపథ్యంలో… ఈ సీజన్ లో మాత్రం మునుపెన్నడూ లేని విధంగా… బిగ్ బాస్ షో లో టాస్క్‌లు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఎక్కువయ్యాయని చెప్పవచ్చు.

గడిచిన ఎపిసోడ్ లో టాస్క్‌ల పేరుతో ఒకరిపై ఒకరు ఎక్కేయడం, అమ్మాయి టీ షర్ట్‌లోకి చేయి పెట్టినట్టు గొడవ పడడం, బూతులు మాట్లాడుతూ సైకోలు కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌ ప్రోమో విడుదల చేయగా… ఇందులో కూడా శారీరక హింసకు పాల్పడుతున్నట్లు కనిపిస్తున్నారు.

ఈ ప్రోమోలో యాంకర్ రవి, సింగర్ శ్రీరామ్‌ల మధ్య గొడవ జరగగా… రవికి శ్రీ రామ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలానే విశ్వ – నటరాజ్ మాస్టర్‌లు ఒకరిపై ఒకరు బల ప్రదర్శనకి దిగడం గమనించవచ్చు. రవి కూడా పగిలిపోద్ది చెప్తున్నా అంటూ సన్నీతో అనడం… ఒక ఎత్తయితే మేము మాత్రం తక్కువ అన్నట్లు లేడీ కంటెస్టెంట్ లు కూడా తమదైన శైలిలో రెచ్చిపోయారు.

దమ్ముంటే రా అని శ్వేతను… సిరి సవాల్ చేయడం అందుకు … శ్వేత పిచ్చెక్కినట్టుగా చేయడం చూడొచ్చు. ముఖ్యంగా ప్రోమో చివర్లో నువ్వు మగాడివి అయితే రా అంటూ సన్నీ ని… ప్రియ ఆంటీ అనడంతో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Jaya Kumar

Hello All, This is Jaya Kumar an enthusiastic writer, I have completed my Journalism & Mass Communications from Acharya Nagarjuna University, Previously worked for ETV Andhra Pradesh & Public Vibe,...

Mail

Published on సెప్టెంబర్ 15, 2021 at 8:15 సా.