Bigg Boss Season 5 బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. కానీ హద్దు దాటుతుందా అని పలు వార్తలు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. గత సీజన్ ల నుంచి కొన్ని కొన్ని సందర్భాల్లో కంటెస్టెంట్ లు ఆవేశంలో హద్దు ధాటి మాట్లాడిన సందర్భాలను చూశాం. అయితే ఈసారి సీజన్ ప్రారంభ దశలో ఉండగానే బిగ్ బాస్ సభ్యులు మాత్రమే కాకుండా బిగ్ బాస్ కూడా నియమాల్ని ఉల్లంగిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంటి సభ్యులు తిట్టుకోవడాలు.. కొట్టుకోవడాలు… దూషించుకోవడాలు… ఆడ, మగ తేడా లేకుండా ఒకరి పైకి ఒకరు ఎక్కేసి టాస్క్ లు చేయడం ఇందుకు నిదర్శనం. అదే విధంగా గత సీజన్ల లాగా బిగ్ బాస్ కూడా వారిని హెచ్చరించకపోవడం పట్ల ప్రేక్షకులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన ఎపిసోడ్ లలో భాగ్యం దూషించడంతో అందరూ షాక్ అవ్వగా … నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన సన్నివేశాల్ని చూస్తుంటే కొట్టుకోవడం కోసమే బిగ్ బాస్ షో జరుగుతుందా అన్నట్లు వ్యవహరించారు. నిన్నటి ఎపిసోడ్ లోని వివరాలు … గురించి ఓ లుక్కేద్దాం…
నటరాజ్ మాస్టర్ గుంటనక్క అంటూ సంభోదిస్తూ కీలక వ్యాఖ్యలు చేయడం పట్ల రవి ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు అంతా అలా ఊహించుకుంటున్నారు మాస్టర్ … అని రవి అడగడంతో … నేనేం ఊహించుకోవడం లేదు, నామినేషన్ ఓట్లు ఎలా పడ్డాయో నాకు తెలుసు అని నటరాజ్ చెప్తాడు. మీరు దేవుడిలా మాట్లాడితే ఇంకేం చెయ్యాలి మాస్టర్… మీరు దేవుడు, మీరు తోపు, తురుము అని నాకు తెలుసు అని రవి అంటాడు. దీనితో వారిద్దరూ కొంచెం సేపు సంభాషించుకుంటారు.
ఆ తర్వాత ప్రియాతో… శ్వేత ఉమాగారు అలా ఎలా మాట్లాడతారు, ఆ లాగ్వేజ్ ఏంటీ అంటూ మాట్లాడుకుంటారు. మరో వైపు సిరి, రవితో… నటరాజ్ మాస్టర్ మీద ఉన్న గౌరవం మొత్తం పోయింది… గుంట నక్కా అని ఎలా అంటారు… అసలు ఏంటి ఆయన… ఆయన ప్రవర్తన ఏంటీ… నాకు అస్సలు నచ్చలేదు అంటూ చెబుతుంది. అనంతరం సన్నీ నటరాజ్ మాస్టర్ దగ్గరకు వెళ్లి… గుంటనక్క అని ఎవరిని అన్నారు… అంటూ ఆరా తీస్తాడు. అదే సమయంలో బిగ్ బాస్ స్కీన్ మీద రవిని చూపిస్తుంటే… మీకు వచ్చేసిందిగా క్లారిటీ అని నటరాజ్ మాస్టర్ చెప్తాడు.
నిన్నటి ఎపిసోడ్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం అంటే అది కెఫ్టెన్ పోటీదారుల టాస్క్ మాత్రమే. పంతం నీదా నాదా… అనే పేరుతో బిగ్ బాస్ ఒక టాస్క్ పూర్తి చేయాలనీ ఇంటి సభ్యులకు ఆదేశిస్తాడు. దీనిలో భాగంగా మొదటి టాస్క్ దొంగలున్నారు జాగ్రత్త… లో పిల్లోస్ లాక్కునే క్రమంలో సిరి షర్ట్‌లో సన్నీ చేయి పెట్టాడని… సిరి చాలా పెద్ద గొడవ చేస్తుంది. అయితే సన్నీ నేను అలా చెయ్యలేదు అని చెప్తూ ఆమెతో గొడవ పడతాడు.మొత్తంగా ఈ టాస్క్‌లో ఆడ, మగా తేడా లేకుండా ఒకరిపై ఒకరు పడుతూ, పైకి ఎక్కేస్తూ ఆడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అలానే ఈ తోపులాటలో లోబోకు గాయం అవ్వడంతో డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్తారు. మరో వైపు రవి-విశ్వకి మధ్య కూడా పెద్ద గొడవే జరుగుతుంది. ఇంత జరుగుతున్న బిగ్ బాస్ మౌనంగా ఉండడం పట్ల తీవ్ర విమర్శలు చేస్తున్నారు.