Bigg Boss బిగ్ బాస్ హౌస్ సీజన్ 5 ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతుంది. బిగ్ బాస్ షో రెండో వారంలోకి ప్రవేశించిన నాటి నుంచి కెప్టెన్సీ టాస్క్ ‘పంతం నీదా నాదా’ లో భాగంగా ఇంటి సభ్యులు అందరు ఎక్కువగా గొడవలు పడడం, అరుపులు, కొట్లాటలు, ఒకరి మీద ఒకరు పడటాలు, తీవ్ర విమర్శలు చేసుకోవడం చూసాం. కాగా నిన్నటి ఎపిసోడ్ మాత్రం ప్రేక్షకులకు కొంత ఊరటని ఇచ్చిందని చెప్పాలి. నిన్నటి ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం…
కెప్టెన్సీ టాస్క్ లో ఇంటి సభ్యులందరూ మూడో లెవెల్ కి చేరుకున్నారు. ఈ మేరకు వారందరికీ కెప్టెన్సీ పోటీదారులను ఎంచుకునే క్రమంలో బిగ్‌బాస్ ‘అగ్గిపుల్లా మజాకా’ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో రెండు టీమ్స్ తమ తమ బాక్సుల్లోని ఇసుకలో అగ్గిపుల్లలు ముట్టించి… చివర్లో ఉన్న కర్పూరం అంటుకునేలా చేయాల్సి ఉంటుంది. ఈ టాస్కులో ఈగల్ టీమ్ గెలవడంతో వారిని విజేతలుగా బిగ్ బాస్ ప్రకటిస్తాడు.
ఆ తర్వాత శ్వేత పుట్టినరోజు సందర్భంగా ఇంటిలో వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా శ్వేతా ఇంటి సభ్యులు విషెస్ చెప్పిన వీడియోను… బిగ్ బాస్ ప్లే చేశారు. దీనితో కొంచెం సేపు శ్వేత ఎమోషనల్ అవ్వగా… ఆమె బర్త్ డే కానుకగా బిగ్ బాస్ ఇంటి సభ్యులందరికి చాక్లేట్లు పంపిస్తాడు.
ఇక అర్ధరాత్రి పూట మానస్ గిన్నెలు క్లీన్ చేస్తుండగా.. అతని దగ్గరకు వచ్చింది లహరి. ఆమె బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని రావడంతో.. నీ ఫేవరేట్ కలర్ బ్లాక్నా అంటూ మానస్ అడుగుతాడు. అవును నాకు బ్లాక్ అంటే ఇష్టం… ఫస్ట్ బ్లాక్ తరువాత వైట్… ఆ తరువాత బ్లూ అని చెప్పింది లహరి. బ్లూ నా ఫేవరేట్ కలర్ అని మానస్ చెప్తాడు. చివరగా లహరికి గుడ్ నైట్ అని చెప్పి, ఆమెను దగ్గరకు తీసుకుని … మానస్ హగ్ చేసుకుంటాడు. ఆ తరువాత లహరి నా బెడ్ వరకూ రా అని మానస్‌ని పిలిచి… తన మైక్ తీసేసి కొన్ని సెకన్ల పాటు మానస్ ని హగ్ చేసుకొనే ఉంటుంది. ఉదయం లేవగానే మళ్లీ ఇద్దరూ కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు.
అలానే ఈగల్ టీమ్ కెప్టెన్ శ్రీరామచంద్ర… విశ్వ, యానీ మాస్టర్, ప్రియాంక , హమీదా లను కెప్టెన్సీకి పోటీదారులుగా చెప్తాడు. వీరికి బిగ్‌బాస్… కొడితే కొట్టాలిరా కొబ్బరికాయ కొట్టాలి అనే టాస్క్ ఇస్తాడు. ఇందులో విశ్వ గెలిచి రెండో వారం కెప్టెన్‌గా ఎంపిక అవుతాడు.
ఇంటి సభ్యుల్లో హమీదా స్మార్ట్, హాట్, క్యూట్, ఇంటెలిజెంట్ అని నాతో అన్నావ్ కదా అని… యాంకర్ రవి… అందరి ముందే షణ్ముఖ్‌ను అడుగుతాడు. చెల్లెలు కూడా అన్నావనగానే ఆ మాట మాత్రం అనలేదు, తాము ఫ్రెండ్స్ అని షన్ను అంటాడు. దీంతో అవాక్కైన రవి… షణ్ముఖ్ ఎంతో ఇష్టపడే పిల్లో మీద S , D తో పాటు H కూడా రాద్దామని జోక్ గా అడుగుతాడు. ఇంట్లో ఉన్నంత కాలం దీప్తి పేరు తీసేసి… తన పేరు రాసుకోమని … కావాలంటే బయటకెళ్లాక మళ్లీ దీప్తి పేరు రాసుకోమని హమీదా చెప్తుంది. దీనితో అక్కడున్న రవి, లహరి ఒక్కసారిగా షాక్ అవతారు.
ఇక ఇంట్లో సింగిల్ బెడ్ దక్కించుకునేందుకు ఉమ, లోబోకు ప్రత్యేక టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. వీళ్లిద్దరిలో ఎవరు ఎక్కువ నవ్విస్తే వాళ్లకు ఆ బెడ్ సొంతమని చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన లోబో… పింకీతో కలిసి స్కిట్ చేసి అందర్నీ నవ్వించాడు. ఆ తర్వాత ఉమాదేవి… సిరితో కలిసి అత్తా కోడళ్ల స్కిట్ తో కామెడీ పండించింది. ఈ కామెడీ స్కిట్లో ఎక్కువ ఓట్లు తెచ్చుకొని లోబో విజేతగా నిలుస్తాడు. దీంతో ఆనందంలో స్విమ్మింగ్ పూల్‌లో దూకుతాడు. తనేదైనా తప్పు చేస్తే క్షమించమని… తను గెలిచిన బెడ్‌ను ఉమాదేవికి ఇస్తాడు.
ఎపిసోడ్ చివరిలో షణ్ముఖ్ పుట్టిన రోజు సందర్భంగా హౌస్ మేట్స్ అందరూ కలిసి సెలబ్రేట్ చేస్తారు. ఈ సందర్భంగా షణ్ముఖ్ తల్లితండ్రులు, అతని గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునైనా వీడియో మెసేజ్‌ను… బిగ్ బాస్ చూపిస్తారు. ఈ వీడియో లో షణ్ముఖ్ కి ‘ ఐ లవ్యూ ‘ చెబుతూ స్ట్రాంగ్ గా ఉండమని దీప్తి చెబుతుంది. అనంతరం షణ్ముఖ్ ఎమోషనల్ అవ్వడంతో ఇంటి సభ్యులు అతన్ని ఓదారుస్తారు.