Ira Khan : కొంతమంది సినీ నటులు తమ సినీ జీవితంలో ఎంతోమంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న ప్పటికీ కన్నవారి విషయంలో మాత్రం తీసుకున్న నిర్ణయాలతో వైరల్ అవుతూ అబాసు పాలయిన ఘటనలు, సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఈ విషయం సౌత్ ఇండియాలో బాగానే పట్టించుకునప్పటికీ నార్త్ ఇండియాలో మాత్రం సినీ సెలబ్రెటీల పిల్లల అలవాట్లు, కెరియర్, ప్రవర్తన, వంటివాటిని పెద్దగా పట్టించుకోరు. దీంతో చాలామంది సెలబ్రెటీల పిల్లలు తమకున్న అలవాట్లు చేసిన పనుల కారణంగా తమ తల్లిదండ్రులు తల దించుకునే పరిస్థితులను తెస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ హీరో అమీర్ ఖాన్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. కాగా ఈ మధ్య నటుడు అమీర్ ఖాన్ తాను నటించిన చిత్రాలతో కంటే ఎక్కువగా వివాదాలు, కాంట్రవర్సీలు వంటివాటితోనే బాగా పాపులర్ అవుతున్నాడు.
అయితే తాజాగా నటుడు అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ కారణంగా సోషల్ మీడియాలో ట్రోలోంగ్ ఎదుర్కొంటున్నాడు. కాగా అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ ఇటీవలే తను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో తన అతికొద్దిమంది సన్నిహితుల మధ్యలో వీరిద్దరి నిశ్చితార్థ వేడుక జరిగింది. అయితే ఈ వేడుకలో ఐరా ఖాన్ నటించిన దుస్తుల కారణంగా కొందరు నెటిజన్లు ఈ అమ్మడి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. అయితే ఈ డ్రెస్ లో ఐరా ఖాన్ కొంతమేర అసౌకర్యంగా కనిపించడంతో పాటూ ఆమె ఎద అందాలు ఆరబోస్తూ కనిపించింది. కాగా ఐరా ఖాన్ నిశ్చి తార్థ వేడుకలను కవర్ చేయడానికి వచ్చిన ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, ఈ అమ్మడి ఫోటోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దీంతో ఈ ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తూ కనీసం తన ఎంగేజ్ మెంట్ రోజునయినా మంచి బట్టలు ధరించకుండా ఇలా అభాసుపాలు అవ్వడం సరి కాదని కామెంట్లు చేస్తున్నారు. అలాగే కూతురు నిశ్చితార్థ వేడుకల రోజున ఎలాంటి దుస్తులు ధరించాలనే విషయాన్ని కూడా ఆమె తల్లిదండ్రులు నిర్ణయించాలని కనీసం ఆ బాధ్యత కూడా నిర్వర్తించక పోతే ఎలా అంటూ ఇటు అమీర్ ఖాన్ ని కూడా దుమ్మెత్తి పోస్తున్నారు…