సెలెబ్రెటీల జీవన శైలికి సామాన్య ప్రజల జీవన శైలికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. సెలెబ్రెటీలు పెట్టే ఒక్క రోజు ఖర్చుతో ఓ నిరుపేద కుటుంబం నెల రోజులు హ్యాపీగా బ్రతికేయొచ్చు. అంత పెద్ద ఎత్తున వారి జీవన శైలి ఉంటుంది. అందుకే నటనపై ఆసక్తి ఉన్న వారు సినిమా పరిశ్రమకు వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తారు. అందుకే సినిమా పరిశ్రమ అనేది ఎప్పుడు ఆకర్శనీయమైన రంగం. అయితే సినిమా పరిశ్రమలో ఎటువంటి సినిమా నేపథ్యం లేకుండా అవకాశం రావడం అన్నది చాలా కష్టమనే భావన అపోహ ఉంది. అయితే ఇది అపోహ అనేది చాలా సార్లు రుజువయింది. అయితే ఇప్పటికే ఇక అవకాశం దొరికితే ఇక ఆ అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఇక ఆ నటుడికి తిరుగు ఉండదు. ఇక బాలీవుడ్ లో సత్తా చాటాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే బాలీవుడ్ లో సత్తా చాటితే ఇక దేశ వ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. స్టార్ స్టేటస్ రావడం ఖాయం. అయితే

బాలీవుడ్ అత్యంత సంపన్న నటులలో ఒకరు అజయ్ దేవగన్ 

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ పేరు తెలియని బాలీవుడ్ సినిమా ప్రేక్షకుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. బాలీవుడ్ యాక్షన్ స్టార్ గా పేరు గాంచిన అజయ్ దేవగన్ అత్యంత సంపన్న నటులలో ఒకరనే విషయం మనకు తెలిసిందే. ఒక్కో సినిమాకు 20 నుండి 30 కోట్లు తీసుకుంటాడనే టాక్ ఉంది. అయితే ఇప్పటికే నెట్టింట్లో అజయ్ దేవగన్ కు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. అజయ్ దేవగన్ తాజాగా ఓ ఖరీదైన ఇల్లు కొనుగోలు చేశాడనే వార్త నెట్టింటిని షేక్ చేస్తోంది. ఆ ఇల్లు విలువ రూ. 60 కోట్లు ఉండనుందని సమాచారం. ఇక ఈ వార్తపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ కరోనా సమయంలో ఎంతో కొంత సహాయం చేయాల్సింది పోయి ఇలాంటి పనులు చేయడమేంటని  పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్న పరిస్థితి ఉంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 31, 2021 at 7:31 సా.