Breaking News: నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా మారింది. ఈ క్రమంలోనే ఈయన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా ఆయనకు మద్దతు తెలపడం కోసం నందమూరి తారకరత్న సైతం పాదయాత్రలో పాల్గొన్నారు. అయితే పాదయాత్ర ప్రారంభమైన కొంత సమయానికి ఈయన స్పృహ తప్పి పడిపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం నందమూరి తారక రత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు అయితే తాజాగా ఈయన హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ పొజిషన్లో ఉందని ఎన్.హెచ్. వైద్య సిబ్బంది ఆయన హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయనకు ప్రత్యేకమైన వైద్య బృందంతో చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.
Breaking News:
ఇలా ఈయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా ఈయన ఆరోగ్య సమాచారాన్ని చాలా గోప్యంగా ఉంచుతున్నట్లు ఎన్ హెచ్ వైద్యులు ప్రకటించారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో చంద్రబాబు నాయుడు,జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరుకు బయలుదేరుతున్నట్టు సమాచారం. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగకూడదని ప్రార్థిస్తున్నారు.