bride groom angry at his wedding video viral
bride groom angry at his wedding video viral

Viral Video : పెళ్లి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది, అది అందరికీ అవసరం కూడా. పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారే వస్తుంది. అందుకే.. పెళ్లి గురించి అందరూ చాలా కలలు కంటుంటారు. ఆ కలల లోకంలో విహరిస్తుంటారు. పెళ్లి నాడు ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉంటారు. అందుకే.. పెళ్లి అంటే నూరేళ్ల పంట అని పెద్దలు అన్నారు.

bride groom angry at his wedding video viral

అయితే.. పెళ్లి మండపంలో పెళ్లి కోసం కూర్చున్న వధూవరులు.. ఎంతో నిష్టతో పెళ్లి కార్యక్రమాన్ని సాగిస్తారు. వధూవరులు తమ పెళ్లి తర్వాత జీవితం కోసం ఎన్నో కలలు కంటుంటారు. అందుకే.. బంధు మిత్రుల సమక్షంలో తమ పెళ్లిని ఘనంగా జరుపుకుంటారు.

ఒక్కోసారి పెళ్లి చాలా సమస్యలను తీసుకొస్తుంటుంది. పెళ్లి పందిట్లో చాలా గొడవలు జరుగుతుంటాయి. పెళ్లి కూతురు తరుపు బంధువులతో లేక.. పెళ్లి కొడుకు బంధువులతో.. భోజనాల విషయంలో లేదా మరేదో విషయంలో గొడవలు అనేవి పెళ్లిళ్లలో సహజం. ఎంత పెద్ద గొడవలు జరిగినా సరే.. పెళ్లి రోజు కాబట్టి.. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇద్దరూ గొడవల్లో తల దూర్చరు.

Viral Video : ఓ వైపు పెళ్లి జరుగుతుంటే.. ఓ వ్యక్తిని చితకబాదిన పెళ్లి కొడుకు

తాజాగా ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అది ఏ వీడియో అంటే.. పెళ్లికి సంబంధించిన వీడియో. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇద్దరూ పెళ్లి పీటల మీద కూర్చొని ఉన్నారు. ఇంతలో వాళ్ల వెనక్కి ఓ వ్యక్తి వచ్చి.. సరదాగా పెళ్లి కొడుకును ఆటపట్టించాడు. పెళ్లి కొడుకు బుగ్గలు గిల్లాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన పెళ్లి కొడుకు ఒక్కసారిగా పైకి లేచి.. ఆ వ్యక్తిని చితకబాదాడు. ఎవ్వరు ఆపినా.. పెళ్లి కొడుకు అయితే ఆగలేదు. రెచ్చిపోయాడు. చివరకు పెళ్లి కూతురు ఆపినా కూడా ఆగలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 14, 2021 at 7:14 సా.