btech : ఈ మధ్యకాలంలో కొందరు కష్టపడకుండా సులభంగా డబ్బు సంపాదించాలని ఆలోచిస్తూ చేసేటటువంటి పనుల కారణంగా కటకటాల పాలవుతున్నారు. ఈ క్రమంలో బీటెక్ చదివినటువంటి యువకుడు ఉద్యోగానికి ప్రయత్నించకుండా ఆన్లైన్ మధ్య మాలలో ఆంటీలతో చాటింగ్ చేస్తూ లక్షలు సంపాదించి చివరికి కటకటాల్లోకి వెళ్లిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని కడప జిల్లా లో ప్రసన్నకుమార్ అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే ప్రసన్నకుమార్ తల్లిదండ్రులు తమ కొడుకుని మంచి ప్రయోజకుడిని చేయాలని కష్టపడి తమకు ఉన్నంతలో బీటెక్ చదివించారు.
కాగా మొదట్లో ప్రసన్నకుమార్ కూడా తమ తల్లిదండ్రుల ఇష్టం మేరకు బాగానే చదివి చదువును పూర్తి చేశాడు. కానీ చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం చేయడం లేదా తనకు నచ్చిన వ్యాపారం చేయడం వంటి వాటికి బదులుగా ఆన్ లైన్ లో పెళ్లయిన మహిళలతో, అలాగే పెళ్లయి భర్తను కోల్పోయిన మహిళలతో చాటింగ్ చేయడం వారితో వీడియో కాల్స్ మాట్లాడటం వంటివి చేయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో మద్యం, జూదం, బెట్టింగులు వంటి వాటికి బానిస అయ్యాడు. అలాగే అందినకాడికి అప్పులు కూడా చేశాడు..
ఇంకేముంది చేసిన అప్పులు తీర్చడానికి అడ్డదారులు తొక్కడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో తనతో సరదాగా వీడియో కాల్స్ మాట్లాడిన పెళ్లయిన మహిళలని బెదిరించి తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తమ నగ్న ఫోటోలు, వీడియోలు, సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో కొందరు మహిళలు తమ పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుందని లక్షల రూపాయలు ప్రసన్న కుమార్ కి ఇచ్చారు. ఆ తర్వాత ప్రసన్న కుమార్ ఉద్యోగం చేయాలంటే కష్టపడాల్సి ఉంటుందని కాబట్టి ఇంట్లోనే ఉంటూ ఇదే బిజినెస్ చేస్తే లక్షల సంపాదించవచ్చని ఏకంగా సోషల్ మీడియాలో మాధ్యమాలలో మహిళలను టార్గెట్ చేస్తూ డబ్బులు గుంజుతో లైఫ్ లీడ్ చేస్తున్నాడు.
ఈ క్రమంలో ప్రసన్న కుమార్ ఆగడాలు రోజురోజుకీ ఎక్కువవుతుండడంతో బాధిత మహిళలు దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి ప్రసన్నకుమార్ పై ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రసన్నకుమార్ ని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు వాస్తవాలు బయట పడ్డాయి. దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతోంది.