Business Idea: ప్రస్తుతం పెద్ద పెద్ద బిజినెస్ ల కంటే చిన్న బిజినెస్ ల ద్వారా ఎక్కువ ఆదాయం సంపాదించుకోవచ్చు. అది ఎలా సాధ్యమవుతుంది అని అనుకుంటున్నారా. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ బయట తినడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు. అది ఎలాంటి ఫుడ్ అయినా సరే తినడానికి మాత్రం వెనుకాడటం లేదు.
దీంతో చాలామంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రకరకాల ఫుడ్ లు ప్రిపేర్ చేస్తూ బిజినెస్ లు చేస్తున్నారు. ఇప్పటికే రకరకాల ఫుడ్ బిజినెస్ లు చేసేవాళ్లు సొంత వెహికల్స్ ద్వారా లేదా ఏదైనా షెడ్డు ద్వారా బిజినెస్ చేస్తూ బాగా సంపాదిస్తున్నారు. అయితే తాజాగా మరో ఫుడ్ బిజినెస్ ఐడియా కూడా అందుబాటులో ఉంది. అది కూడా కేవలం నాలుగు గంటల పని చేస్తే సరిపోతుంది.
ఇంతకు ఆ ఫుడ్ ఏంటంటే.. ఫాస్ట్ ఫుడ్. మామూలుగా ఇప్పటికే చాలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఉన్నాయి. ఇది కాస్త వెరైటీగా ప్లాన్ చేసుకోవచ్చు. అదేంటంటే వెజ్, నాన్ వెజ్, ఎగ్ రోల్స్. మధ్యకాలంలో వీటికి మంచి డిమాండ్ ఉందని చెప్పవచ్చు. ఎక్కువగా థియేటర్లలో వీటి కొనుగోలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు.
కాబట్టి వీటిని బయటపెట్టినప్పటికీ కూడా మంచి లాభం ఉంటుంది. ఈ బిజినెస్ పెట్టడానికి ముందుగా పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్లేస్ ఎంచుకోవాలి. ఇక అది షాపింగ్ కాంప్లెక్స్ లో అయినా సరే.. రోడ్లపై ఏదైనా చిన్న స్టాల్ పెట్టుకున్న సరే సరిపోతుంది. ఇక షాపు లేదా స్టాల్ ఏర్పాటు చేసుకోవడానికి నెలవారిగా అద్దె ఉంటుంది. లేదా సంవత్సరం అద్దె కూడా ఉంటుంది.
ఒక అంచనం ప్రకారం నెలకు 50,000 అనుకున్నప్పటికీ.. ముందుగా స్టెయిన్ లెస్ స్టీల్ స్టాల్ కౌంటర్ సైజును బట్టి ఏర్పాటు చేసుకోవాలి. దాని ధర పదివేల నుంచి 60 వేల వరకు ఉంటుంది. గ్యాస్ స్టవ్ ఏర్పాటు చేసుకోవడానికి.. ముడి సరుకులు పెట్టుకోవడానికి స్థలం ఉండేలా చూసుకోవాలి. కస్టమర్స్ వచ్చి కూర్చోవడానికి టేబుల్స్, కుర్చీలకు ఒక మూడు వేల వరకు ఖర్చు అవుతుందని చెప్పవచ్చు.
Business Idea:
ఇక మనం ఫుడ్డు తయారు చేసుకోవడానికి క్వాంటిటీ బట్టి ఖర్చు అవుతుంది. కస్టమర్స్ ని దృష్టిలో పెట్టుకొని ఎంత క్వాంటిటీ అవుతుందో దాన్ని బట్టి కొనుగోలు చేసి వారి ముందే తయారు చేస్తే ఇంకా బాగుంటుంది. ఇక ఇలా సాయంత్రం టైంలో కేవలం నాలుగు గంటలు మాత్రమే పని చేస్తే రూ.1200 అంతకుమించి ఎక్కువ సంపాదన సొంతం చేసుకోవచ్చు.