Business Ideas: వ్యాపారం చేయాలి అనుకునే వాళ్ళకి చాలామందికి ఏ వ్యాపారం చేయాలో తెలియక సతమతమౌతూ ఉంటారు. అలాంటివారు వారి కోసమే ఈ బిజినెస్ ఐడియా.ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కార్ వాషింగ్ బిజినెస్ గురించి. కార్లు బైకులు రోజురోజుకీ పెరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే.
అన్ని యంత్రాల మాదిరిగానే వీటికి కూడా నిర్వహణ మరియు సాధారణ వాష్ అనేది చాలా అవసరం. నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఎవరి కార్లు వారు కడుక్కునే టైం కూడా ఎవరికి ఉండటం లేదు. అందుకే ఈ వ్యాపారం ఎప్పటికీ నష్టం లేని వ్యాపారం. అలాగే పెట్టుబడి కూడా చాలా తక్కువ. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం కోసం మునిసిపల్ అథారిటీ నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి.
మీ బడ్జెట్ ని బట్టి రెండు విధాలుగా కార్ వాషింగ్ బిజినెస్ చేయవచ్చు. ఒకటి డోర్ టు డోర్ డెలివరీ సౌకర్యంతోను ఒకటి కార్ వాష్ సెంటర్ సౌకర్యంతోను ప్రారంభించవచ్చు. డోర్ టు డోర్ సర్వీసు ప్రారంభించినప్పుడు నమ్మకమైన వ్యక్తులని ఉద్యోగులుగా నియమించుకోవడం ముఖ్యం.
అదే వాష్ సెంటర్ ని ఓపెన్ చేసేటట్లయితే అనేక కార్లను కడగటానికి తగినంత పెద్దదిగా స్థలం ఉండి తీరాలి. కార్ వాషింగ్ కోసం ప్రొఫెషనల్ మెషిన్ అవసరం. ఈ మిషన్ ధర 12 వేల నుంచి లక్ష రూపాయలు వరకు ఉంటుంది. మీ బడ్జెట్ని బట్టి మీరు మిషన్ ని ఎన్నుకోవాల్సి ఉంటుంది.
దీంతోపాటు 30 లీటర్ల వ్యాక్యూమ్ క్లీనర్ ని కొనుగోలు చేయాలి దీని ధర దాదాపు 10,000 వరకు ఉంటుంది. కారు వాషింగ్ కాస్ట్ ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. టౌన్ ప్రాంతాల్లో ఒక రేటు, టౌన్ కి దూరంగా ఉన్న ప్రాంతాల్లో మరొక రేటు వసూలు చేస్తారు.మీరు వ్యాపారాన్ని ప్రారంభించేముందు ఏ, ఏ ప్లేస్ లలో రేట్లు ఎలా ఉన్నాయో సమాచారం సేకరించండి.
Business Ideas:
ఒక ప్రణాళిక ప్రకారం వ్యాపారం చేస్తే ఈ వ్యాపారానికి తిరుగుండదు. మీకు తెలిసిన బైక్ మెకానిక్ ఎవరితోనైనా వ్యాపార ఒప్పందం కుదుర్చుకొని వారి షాప్ పక్కనే మీ షాప్ కూడా పెట్టుకునేటట్లయితే తొందరగా అందరి దృష్టిలో పడతారు. తద్వారా వ్యాపారం త్వరగా అందిపుచ్చుకుంటుంది.