Business Ideas: తక్కువ పెట్టు బడితో ఎక్కువ లాభాలు పొందాలని చాలా మంది అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం తక్కువ పెట్టుబడి తో ఎక్కువ రాబడి వచ్చే బిజినెస్ ఐడియా లు ఇవే..
ఆన్లైన్ ట్యూషన్స్ మీకు మంచి బిజినెస్ ఐడియా అని చెప్పాలి. మీకు అందుబాటులో ఉన్న పోర్టల్ లో డబ్బులు కట్టి సోషల్ మీడియా ద్వారా స్టూడెంట్స్ ను చదివించవచ్చు.
బ్లాగింగ్ ఒక మంచి బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ తో చాలా మంది సెటిల్ అయ్యారు. ఫేస్బుక్ లో కొన్ని పోస్ట్ లు షేర్ చేసి చేసి కొంచెం ట్రాఫిక్ వచ్చాక మీరు గూగుల్ యాడ్స్ కి అప్లై చేసుకుంటే ఈజీ గా అప్రూవల్ అవుతుంది. దీంతో మంచి రాబడి వస్తుంది.
టిఫిన్ కారియర్ బిజినెస్. ఈ బిజీ లైఫ్ లో ఎవరికీ వంట చేసుకునే తీరిక లేకుండా పోయింది. మంచి రుచికరమైన వంటలు చేసి మధ్యాహ్నం భోజనం కి టిఫిన్ కెరీర్ ఇచ్చే బిజినెస్ చేస్తే మంచి లాభం వస్తుంది.
యూట్యూబ్ వీడియోస్ తో బాగా బిజినెస్ చేయవచ్చు. ట్రావెలింగ్, సినిమా న్యూస్, సినిమా రివ్యూస్, ప్రాంతాలు విశేషాలు, డివోషనల్ ఇలా ఏమైనా యూట్యూబ్ లలో వీడియోస్ చేసి సబ్స్క్రైబర్స్ నీ పొందితే ఇక మీకు లాభాలే లాభాలు.
రెంటల్ బిజినెస్ ఒక మంచి బిజినెస్ సలహా. ఈ బిజీ లైఫ్ లో రెంటెడ్ హౌస్ లు చూసుకునే టైం ఎవ్వరికి ఉండడం లేదు. అందువల్ల హౌజ్ రెంట్ ఆఫీస్ నీ తెరిచి మంత్ రెంట్, అడ్వాన్స్ ఛార్జ్ చేస్తే సరిపోతుంది.
ఎస్ ఈ ఓ. ఎస్ ఈ ఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్ ఈ కోర్స్ యూటుబ్స్ లో దొరుకుతుంది. చాల మంది వెబ్సైట్ రన్ చేస్తున్నారు. వాళ్ళ వెబ్ సైట్ ను ప్రమోషన్స్ చేసి డబ్బులు సంపాదించవచ్చు.
ఆన్లైన్ బర్త్డే కేక్ బిజినెస్. కేక్ ఎవరికైనా అవసరమే కానీ కొందరికి బేకరి కి వెళ్లి తీసుకునే సమయం ఉండదు. దీనికి ఒక వెబ్సైటు తాయారు చేపించి అందులో ఆర్డర్స్ పొందటం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.
Business Ideas: ఈ బిజినెస్ ఐడియాలు అన్ని ట్రై చేస్తే ఇక లాభాలే లాభాలు..
కంటెంట్ రైటర్ జాబ్స్ కి విపరీతమైన డిమాండ్ ఉంది. దీనికి కావాల్సింది మీ స్టైల్ లో మీరు గా అందరికి నచ్చేలా రాయటమే. ఒకేసారి ఒకటి నుండి పది వెబ్సైటు లకి ఫ్రీలాన్స్ గా చేసుకోవచ్చు.