Business Tips: మామూలుగా ఒక ఉద్యోగం పొందాలంటే దానికి చదువు, మంచి టాలెంట్, స్కిల్స్ ఉండాలి. అవి ఉండటమే కాకుండా పెద్దపెద్ద ఇంటర్వ్యూలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే వ్యాపారం చేయాలనుకుంటే మంచి ఆలోచన, పెట్టుబడికి డబ్బు ఉంటే చాలు. ఉద్యోగం చేసే వారి కంటే ఎక్కువగా సంపాదించవచ్చు. అవును ఈ మధ్యకాలంలో చాలామంది ఉద్యోగం కంటే వ్యాపారం బెటర్ అనుకుంటున్నారు.
ఎందుకంటే వ్యాపారంలో ఎక్కువ సంపాదన ఉంటుంది కాబట్టి. ఇక ఇప్పటికే చాలామంది రకరకాల బిజినెస్లు చేసుకుంటూ పోతున్నారు. అయితే కొత్తగా వ్యాపారాలు చేయాలనుకునే వాళ్లకు కొన్ని అద్భుతమైన ఐడియాలు ఉన్నాయి. ఈ ఐడియాలను ఫాలో అవుతే మాత్రం నెలకు రూ. 50 వేల నుండి రూ. లక్ష సంపాదించడం గ్యారెంటీ. ఇంతకు ఆ ఐడియా లేంటో ఇప్పుడు చూడండి.
మామూలుగా కోళ్ల వ్యాపారం ద్వారా మంచి రాబడి ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. అయితే ఇది పెట్టడానికి చాలామంది ముందుకు రాలేకపోతారు. కానీ ముద్ర లోన్ తీసుకోవడం వల్ల పౌల్ట్రీ ఫార్మ్ బిజినెస్ మొదలు పెట్టవచ్చు. ఇక హనీ బిజినెస్ కూడా బాగా నడుస్తుంది. ఈ వ్యాపారం చేయాలనుకుంటే మాత్రం పెట్టుబడి లక్షన్నర అవుతుంది.
అంతేకాకుండా ప్రభుత్వం నుంచి ఆర్థికంగా సహాయం కూడా అందుతుంది. ఈమధ్య చాలామంది కూరగాయల వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కూరగాయల బిజినెస్ కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. దీని ద్వారా కూడా మంచి వ్యాపారం చేయవచ్చు. పుట్టగొడుగుల వ్యాపారం చేయటం వల్ల మంచి లాభం ఉంటుంది.
Business Tips:
పుట్టగొడుగులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. వీటిని అతి తక్కువ ఖర్చుతో పెంచి ప్రతినెల రూ.50 వేలు సంపాదించడం గ్యారెంటీ. అలోవెరా మొక్కలను కూడా పెంచడం వల్ల మంచి లాభం ఉంటుంది. ఇది మెడిసినల్ ప్లాంట్ కాబట్టి దీనికి కూడా బయట బాగా డిమాండ్ ఉంటుంది. ఇక ఇది కూడా తక్కువ ఖర్చుతో పెంచవచ్చు. ఇక ఇవే కాకుండా చేపల పెంపకంతో కూడా వ్యాపారం చేయవచ్చు.