Business Tips: ఒకప్పుడు స్త్రీలను వ్యాపారంలో గాని ఉద్యోగంలోనూ గాని అరుదుగా చూసేవాళ్ళం కానీ నేటి స్త్రీలు నూటికి 90 మంది ఆర్థిక స్వావలంబన కోసం ఉద్యోగాలు చేస్తున్నారు. కుదరని వారు ఇంట్లో ఉంటూనే డబ్బు సంపాదించే ప్రయత్నాలు చేస్తున్నారు. చాలామంది ఆడవాళ్ళకి డబ్బు సంపాదించాలని ఉంటుంది కానీ ఎలా సంపాదించాలి అనే దాని పైన స్పష్టమైన అవగాహన ఉండదు.
ఈరంగం మీద ఎంత పెట్టుబడి పెట్టొచ్చు అనే విషయంపై అవగాహన లేక ఒక్కొక్కసారి ఎదురుదెబ్బలు తినవచ్చు. అందుకే వ్యాపారాన్ని ప్రారంభించేముందు మీకు ఏ విషయాలపై అవగాహన ఉంది ఎంతవరకు పెట్టుబడి పెట్టుకోగలరు అని మ్యారేజ్ వేసుకోండి. ఏ బిజినెస్లు చేస్తే ఎంతవరకు లాభం వస్తుంది, దానిని మీరు ఎంత సమర్ధవంతంగా నిర్వహించగలరు అనేదానిమీద అవగాహన పెంచుకోండి.
మీలాంటి వాళ్ల కోసమే కొన్ని ఐడియాలు ఇక్కడ ఇస్తున్నాం. చూసి దానిమీద ఒక అవగాహనకి వచ్చాక అప్పుడు అడుగు ముందుకు వేయండి. స్మాల్ ఇండస్ట్రీ అనగానే ఆడవాళ్లు ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీ వైపు చూస్తారు ఎందుకంటే సహజంగా వాళ్ళు గరిట తిప్పడం లో సిద్ధహస్తులు కాబట్టి. కొంచెం శ్రద్ధ పడితే మరింత నిపుణులు కాగలరు.
నేటి ఉరుకుల, పరుగుల ప్రపంచంలో ఇంట్లో వంటలు చాలా మటుకు తగ్గించేశారు మహిళలు. అందుకే రెస్టారెంట్లు, కెఫెలు, ఆన్లైన్ బుకింగ్లు బాగా ఎక్కువ అయ్యాయి. ఈ రంగం మీద మీకు అవగాహన ఉంటే తక్కువ పెట్టుబడి తో మంచి లాభాలు తీసుకువచ్చే వ్యాపారం అవుతుంది. ఆడవాళ్ళకి పనికొచ్చే మరొక ముఖ్యమైన బిజినెస్ బ్యూటీ పార్లర్ బిజినెస్.
చాలా రోజుల క్రితం వరకు యువత మాత్రమే అందం మీద దృష్టి పెట్టేది ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ప్రతి వాళ్లు అందం మీద ఆరోగ్య మీద దృష్టి పెడుతున్నారు. పెళ్లిళ్లకి మేకప్ చేయడానికి కూడా ఇప్పుడు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇందులో మీకు అనుభవం ఎక్కువగా ఉంటే ట్రైనింగ్ సెంటర్ కూడా ఓపెన్ చేయొచ్చు. మెహందీ ఆర్టిస్ట్, నెయిల్ ఆర్టిస్ట్, ఇవి కూడా మంచి ఆదాయం తెచ్చే బిజినెస్ లే.
పైగా వీటికి పెట్టుబడి కూడా అక్కర్లేదు. పాపులర్ అవ్వచ్చు. కొందరి స్త్రీలకి ఇంటి నుంచి బయటికి కదలటం కుదరదు కానీ వాళ్ళకి సంపాదన అవసరం ఉంటుంది అటువంటి వాళ్ళకి ఫ్రీలాన్సింగ్ బాగా ఉపయోగపడుతుంది. భాష పై పట్టు ఉండి రాయడం మీద అవగాహన ఉంటే ఈ ఫ్రీ లైన్స్ లో బోలెడు అవకాశాలు ఉంటాయి ఆదాయం కూడా అలాగే ఉంటుంది.
Business Tips:
ఇంట్లో పని చేసుకుంటూనే ఈ పని కూడా చేసుకోవచ్చు. ఇంకా బేబీ కేరింగ్, ఐటీ ప్రొఫెషనలిజం, జుంబా ఇన్స్ట్రక్టర్ ఇలాంటి ఎన్నో బిజినెస్ లు ఆడవాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కానీ వీటి మీద అవగాహన పెంచుకొని, లాభనష్టాల బ్యారేజీ వేసుకున్నాక అడుగు ముందుకు వేయండి. ఆల్ ద బెస్ట్ మహిళలు.