Cine Director’s: టాలీవుడ్ లో చాలా మంది దర్శకులు ఉన్నారు. అందరూ గుర్తుండకపోయినా వారు తీసిన సినిమాల ద్వారా కొందరు ప్రజల నోళ్లలో నానుతుంటారు. అలాంటి కోవకు చెందిన వారే డైరెక్టర్ వీర శంకర్. తణుకులో పుట్టిన ఈయన డైరెక్టర్ కోడిరామక్రిష్ట దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత తెలుగులో రెండు సినిమాలు చేశారు. హలో ఐలవ్ యూ, గుడుంబా శంకర్ వంటి సినిమాలు అంజని ప్రొడక్షన్స్ లో చేశారు. గుడుంబా శంకర్ సినిమా పరాజయం అవ్వడంతో కన్నడ ఇండస్ట్రీలో పునీత్ రాజ్ హీరోగా నమ్మ బసవ అనే సినిమా చేశారు.
తాజాగా డైరెక్టర్ వీర శంకర్ ఓ ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు తెలిపారు. కులపిచ్చి అనేది ఇంకా ఉందని, తాను ఆ బాధను అనుభవించానని వెల్లడించారు. చిత్రపురి కాలనీ గురించి స్పందించారు. సినీ కార్మికుల కోసం చాలా రోజుల నుంచి పోరాటం చేస్తుంటే చిత్రపురి కాలనీ ఏర్పాటు అయ్యిందని అన్నారు. అయితే చిత్రపురిలో తీవ్ర స్థాయిలో అవినీతి జరుగుతోందని, నిజమైన సినీ కార్మికులకు అక్కడ అవకాశం లేదని తెలిపారు.
సినిమా కార్మికుల కోసం ఇల్లు కట్టుకోవడానికి అప్పటి నటుడు ప్రభాకర్ రెడ్డి స్థలాన్ని దానం చేశారని, అదే ఇప్పుడు చిత్రపురిగా ఆవిర్భవించిందని తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో లేనివారు ఇక్కడ ఇళ్లను పొందడం సిగ్గు చేటని అన్నారు. డైరెక్టర్స్ అసోసియేషన్ తరపును తన వాదనను గట్టిగా వినిపిస్తున్నానని తెలిపారు. ఈ మధ్యకాలంలో డైరెక్టర్స్ అసోసియేషన్ లో కూడా నకిలీ సినీ కార్మికులను గుర్తించి తీసివేసినట్లు వెల్లడించారు.
Cine Director’s:
చిత్రపురి కాలనీలో జరుగుతున్న అన్యాయం గురించి పెద్దలు ఎవ్వరూ కలుగజేసుకోవడం లేదని, మా అసోసియేషన్, కార్మిక ఫెడరేషన్ రెండూ కలిపి ఒక టీమ్ గా ఏర్పడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ రెండు కలిపి ఒక అథారిటీగా ఏర్పడితే సినీ కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. కార్మికుల సమస్యలు తమకెందుకులే అని సినీ పెద్దలు ఆలోచించడం వల్ల నిజమైన లీడర్లు కనుమరుగు అవుతున్నారని డైరెక్టర్ వీర శంకర్ తెలిపారు.