Chandrababu: మొత్తానికి చంద్రబాబు పర్యటన కుప్పం నియోజకవర్గంకు చేరింది. ఇటీవలే ఆయన రెండు ప్రాంతాలలో పర్యటించగా అక్కడ జరిగిన ఘటన అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటువంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉండటానికి పోలీసులు కొన్ని నిబంధనలు చేపట్టారు. అయినప్పటికీ కూడా చంద్రబాబు పోలీసులు విధించిన నిర్బంధాలు, అడ్డంకులను ఎదుర్కొని మరి పర్యటనలో పాల్గొన్నాడు.
ఆయన కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటన చేయనున్నాడు. దీంతో ఆయన ఆంధ్ర కర్ణాటక బార్డర్లో శాంతిపురం మండలం జేపీ కొత్తూరు కు చేరుకోవటంతో తెదేపా నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వీళ్లను చూసి చంద్రబాబు వాహనం నుండి బయటికి వచ్చి అందరికీ నమస్కరించాడు. ఇక ఆ ప్రాంతం మొత్తం భారీ జనసాంద్రత మునిగిపోయింది.
ఇక పెద్దూరులో పోలీసులు ఆయన పర్యటనకు అనుమతి లేదని నోటీసులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు కొత్తూరు నుంచి భారీ ర్యాలీతో తరలి వస్తున్నాడు. ఇటీవలే పర్యటనకు ముందు అనుమతులు తీసుకోవాలి అని నోటీసులు వచ్చినప్పటికీ కూడా ఎటువంటి అనుమతులు లేకుండా పర్యటనలో పాల్గొనడంతో చంద్రబాబు ప్రచార రథాన్ని సీజ్ చేశారు పోలీసులు. అంతేకాకుండా పెద్దూరులో ఏర్పాటు చేసిన మైకులు కూడా తొలగించారు.
Chandrababu:
అప్పటికే పలమనేరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి, స్థానిక సీఐ చంద్రబాబుకు ఇటువంటి రోడ్ షోలకు, ర్యాలీలకు అనుమతి లేదని నోటీసులు జారీ చేశారు. దీంతో పోలీసుల తీరుపై వెంటనే చంద్రబాబు ఫైర్ అయ్యాడు. వెంటనే ఆయన వాహనం నుండి బయటికి వచ్చి పాదయాత్ర చేపట్టాడు. సొంత నియోజకవర్గంలో పర్యటించేందుకు ఆంక్షలు విధిస్తారా అంటూ వారిపై కోపంగా అడిగాడు. ఆ తర్వాత పలమనేరు డి.ఎస్.పి ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు చంద్రబాబును అడ్డుకున్నారు. ఇక వెంటనే తెలుగుదేశం పార్టీ శ్రేణులు నినాదం మొదలుపెట్టారు. ఆ తర్వాత స్థానిక నేతలతో చంద్రబాబు చర్చలు చేశాడు. ఇక పోలీసులు మాత్రం ఎటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతూనే ఉన్నారు.