Chandrababu: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు వరుస పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో నెల్లూరు జిల్లా కందుకూరులో ఆయన పర్యటన చేపట్టగా ఆ సమయంలో తొక్కిసిలాట జరిగి 8 మంది మరణించారు. అయినప్పటికీ చంద్రబాబు ఆ పర్యటనను అక్కడితో ఆపి వేయకుండా ఇటీవలే గుంటూరులో కూడా నిర్వహించాడు. అయితే అక్కడ కూడా తొక్కిసలాట జరగటంతో పలువురికి గాయాలయ్యాయి.
అయినా కూడా చంద్రబాబు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకుండా రేపు కుప్పంలో పర్యటన చేయనున్నాడు. దీంతో ఘటనల వల్ల రాష్ట్ర హోంశాఖ తెలుగుదేశం పార్టీకి నోటీసులు జారీ చేశారు. ఇక రేపు జరగబోయే కార్యక్రమం కి ఇప్పటినుండే అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో పలమనేరు పోలీసులు రోడ్లపై సభలు, ర్యాలీలు, రోడ్ షోల మీద ప్రభుత్వం విధించిన కొత్త మార్గదర్శకాల ఆధారంగా పర్యటనను చేపట్టాలి అని తెదేపా నాయకులకు జారీ చేశారు.
ఎక్కడైతే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందో అక్కడే సభలు, కార్యక్రమాలు నిర్వహించాలి అని తెలిపారు. అంతేకాకుండా సభలు ఎక్కడ పెడుతున్నారో ముందుగానే సమాచారం ఇవ్వాలి అని తెలిపారు.ఇక పోలీసులు నోటీసులు జారీ చేయడంతో తెదేపా నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ ఆంక్షల పేరుతో తమ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఇక తమకు అనుగుణంగానే ముందుకు వెళ్తాము అని గట్టిగా తెలుపుతున్నారు.
Chandrababu
కుప్పంలో చంద్రబాబు వరుసగా మూడు రోజుల పాటు పర్యటన చేయనున్నాడు. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు పోలీసులు కూడా అక్కడ ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడటానికి యాక్ట్ నిబంధనలు అమలు చేస్తున్నారు. రోడ్లు మార్జిన్ ల వద్ద కూడా పోలీసులు యాక్ట్ నిబంధనలు చేపట్టనున్నారు. ఎక్కడ కూడా రోడ్డు షోలు నిర్వహించకుండా చూడాలి అని పోలీసులకు హోం శాఖ తెలిపింది. ఒకవేళ అత్యంత సందర్భాలలో మాత్రమే షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలి అని తెలిపింది.