నిర్మాత సురేష్ బాబు తనయుడిగా దగ్గుబాటి అభిరామ్ పేరు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా సినిమా వర్గాల వారికి మాత్రమే పరిచయం. ఎవరైనా సినిమా వారసునికి హీరోగా అయితే తొలి సినిమా ద్వారా ప్రేక్షకులలో గుర్తింపు వస్తుంది. అయితే ఒక్క సినిమా కూడా చేయకుండానే దగ్గుబాటి అభిరామ్ పేరు మారుమ్రోగి పోయింది. అది ఎలాగో మనందరికి తెలుసు. శ్రీరెడ్డి అభిరామ్ పై అప్పట్లో చేసిన ఆరోపణలు పెద్ద సంచలనంగా మారాయి. అభిరామ్ నాకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి, నన్ను శారీరకంగా వాడుకున్నాడని, ఇక నాతో ఎన్నో ఏళ్ళు తిరిగి ఒక్క సినిమా అవకాశం కూడా ఇవ్వకుండా మోసం చేసాడని శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ పెద్ద చర్చగా మారి ట్రెండింగ్ ఇష్యూ లా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా అభిరామ్ స్పందించాడు.
ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు: దగ్గుబాటి అభిరామ్
ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారని, కాని అందరి తప్పులు బయటపడవని, కాని నా తప్పులు బయటపడ్డాయని అభిరామ్ అన్నారు. ప్రస్తుతం పూర్తిగా సినిమా కథల ఎంపికపై పూర్తిగా దృష్టి పెట్టానని, ప్రేమ, కుటుంబ కథా చిత్రాలలో నటించాలని ఉందని అభిరామ్ అన్నారు. శ్రీరెడ్డి వ్యవహారం అభిరామ్ సినిమా కెరియర్ కు పెద్ద మచ్చగా ఉండిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే శ్రీరెడ్డి మరల అభిరామ్ ను టార్గెట్ చేయడం మొదలుపెడితే హీరోగా అభిరామ్ కెరియర్ కు పెద్ద అడ్డంకిగా మారుతుంది. ఇక నిర్మాత సురేష్ బాబుకు పరిశ్రమలో సీనియర్ నిర్మాతగా మంచి గౌరవం ఉన్న విషయం తెలిసిందే. దగ్గుబాటి రామానాయుడు వారసత్వాన్ని విజయవంతంగా మంచి సినిమాలు నిర్మిస్తూ తోటి నిర్మాతలకు సైతం, ప్రస్తుతం నిర్మాతలు లాభాల బాట పట్టడానికి గల అవకాశాలను ఒక సీనియర్ నిర్మాతగా ఎప్పటికప్పుడు పలు వేదికల్లో వివరించే ప్రయత్నం చేస్తుంటాడు నిర్మాత సురేష్ అభిరామ్. సినిమా పరిశ్రమలో ఇంతటి ప్రాబల్యం ఉన్న నిర్మాత సురేష్ బాబు తన కుమారుడిని లాంచ్ చేయడంలో కారణం శ్రీరెడ్డి వ్యవహారం అని మనం చెప్పక తప్పదు.