Atlee: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అట్లీ తాజాగా జవాన్ సినిమా ద్వారా సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయన సినీ కెరియర్ లో వచ్చినటువంటి సినిమాల గురించి ఒక వార్త వైరల్ గా మారింది. అట్లీ రాజా రాణి సినిమా ద్వారా డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇలా ఈయన చేసిన సినిమాలన్నీ కూడా ఎంతో మంచి సక్సెస్ కావడంతో తక్కువ సమయంలోనే స్టార్ డైరెక్టర్గా గుర్తింపు పొందారు.
ఇకపోతే అట్లీ దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమాలో కూడా హీరోయిన్స్ చనిపోతూ రావడం చూస్తున్నాము. ఈయన మొదటిసారి దర్శకత్వం వహించిన రాజా రాణి సినిమాలో నటి నజ్రియా నజీమా కారు ప్రమాదంలో చనిపోతారు అలాగే తన రెండవ సినిమా తెరి. ఈ సినిమాలో కూడా బుల్లెట్ తగిలి సమంత చచ్చిపోతుంది. ఇక మూడవ సినిమా మెర్సల్ ఈ సినిమాలో కూడా నిత్యమీనన్ చనిపోతుంది. ఇక తాజాగా ఈయన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జవాన్ ఈ సినిమాలో కూడా అట్లీ హీరోయిన్ ను చంపేయడంతో ప్రతి ఒక్కరు కూడా ఈయన సినిమాలపై కామెంట్స్ చేస్తున్నారు.
అట్లీ హిట్ సెంటిమెంట్ అదేనా…
అట్లీ సినిమాలలో హీరోయిన్స్ చనిపోతేనే సినిమా సక్సెస్ అవుతాయి అంటూ కామెంట్లో వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో సీనియర్ షారుక్ ఖాన్ కి భార్యగా నటించిన దీపికా పదుకొనే పాత్ర కొంచమే ఉన్నప్పటికీ ఈ పాత్రలో నటించినటువంటి ఈమె కూడా చనిపోతుంది.
కమర్షియల్ సినిమాల్లో కథానాయికల పాత్రలకు ట్రాజెడీ ఎండింగ్ ఇవ్వడం అట్లీ స్టైల్. కథకు, ప్రేక్షకులకు మధ్య ఎమోషనల్ కనెక్ట్ కోసం హీరోయిన్లను ఆయన చంపేస్తున్నారని అనుకోవాలి. ఈ విధంగా అట్లీ తన తదుపరి సినిమాలలో ఇంకా ఎంతమంది హీరోయిన్లను చంపేస్తారో తెలియాల్సి ఉంది.