Devatha April 28 Episode: రాధకు తప్పిన ప్రమాదం.. ఆదిత్యపై నింద వేసిన మాధవ!

Akashavani

Devatha April 28 Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.. మాధవ రాధ గది దగ్గరకు వెళ్లి అక్కడ రాధను చూస్తూ తన సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. అప్పుడే రాధకు మేలుకు రావడంతో మాధవ ని చూసి షాక్ అవుతుంది. ఇక వెంటనే మాధవ అక్కడి నుంచి బయల్దేరుతుండగా రాధ వచ్చి ఎందుకు అలా చూస్తున్నారు అని గట్టిగా అడుగుతుంది.

రాధతో నువ్వు నా రాధ అన్న మాధవ..

దాంతో మాధవ పిల్లలను చూడాలనిపించిందని అందుకే వచ్చాను అని అంటుంది. కాని రాధ మాత్రం.. మీలో ఏదో తేడా వచ్చింది. మీరు కొత్తగా ప్రవర్తిస్తున్నారు అని గట్టిగా నిలదీస్తుంది. ఇక దాంతో మాధవ మాట్లాడుతూ పిల్లలను దూరం చేసుకోను.. నా రాధ ను కూడా.. అదే నిజం అని అక్కడ నుంచి వెళ్ళి పోతాడు. దాంతో రాధ షాక్ అవుతుంది. అంతేకాకుండా గతంలో మాధవ ప్రవర్తించిన తీరును గుర్తు చేసుకొని కుమిలిపోతుంది.

సీన్ కట్ చేస్తే..

ఇక మరుసటి రోజు ఉదయాన్నే రాధ నిద్ర లేచి పిల్లల్ని చూసుకుంటుండగా.. పక్కనే ఉన్న దేవి కనిపించకుండా పోతుంది. దాంతో రాధ ఇల్లు మొత్తం దేవి కోసం వెతుకుతుంది. దేవి కనిపించడం లేదు అని రామమూర్తి, జానకి లకు చెప్పటంతో వాళ్లు కూడా షాక్ అవుతారు. అప్పుడే మాధవ కూడా రావడంతో మాధవ కూడా షాక్ అవుతూ కనిపిస్తాడు.

ఆదిత్యను అనుమానించిన మాధవ..

రాధ.. చిన్మయి దగ్గరికి వెళ్లి దేవి గురించి అడగడంతో తనకు తెలియదని చెబుతుంది. తన చెల్లెలు కనిపించడం లేదు అని తెలియడంతో తను కూడా ఏం జరిగింది అని భయపడుతుంది. ఇంట్లో వాళ్లంతా ఊర్లో మొత్తం దేవి గురించి అడుగుతూ వెతుకుతూ ఉంటారు. మరో వైపు మాధవ కూడా వెతుకుతుండగా ఆదిత్య కారు ఎదురు వస్తుంది. ఇక మాధవ ఆదిత్యతో దేవి ఎక్కడ.. దత్తత ఇవ్వకపోతే అలా దొంగతనం చేసి తీసుకెళ్తావా అని నిందలు వేస్తాడు.

దాంతో ఆదిత్య కూడా దేవి కనిపించడం లేదని తెలిసేసరికి షాక్ అవుతాడు. మాధవ మాత్రం ఆదిత్యను అనుమానిస్తాడు. ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం జరుగుతుండగా.. అక్కడకు రాధ వచ్చి వాళ్ళని చూసి ఆ గొడవను ఆపుతుంది. బిడ్డను వెతకకుండా ఇక్కడ గొడవ పడుతున్నారు ఏంటి అని వారిపై అరుస్తుంది. ఆదిత్య వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం రాధ అంటూ రాధ ను తనతో తీసుకొని వెళ్తాడు.

Devatha April 28 Episode: రాధ కు తప్పిన ప్రమాదం..

 

అది చూసి మాధవ కుమిలిపోతాడు. మాధవ నాపై ఇలా నింద వేసాడు ఏంటి అని ఆదిత్య రాధతో చెబుతూ బాధపడతాడు. రోడ్డుపై వెళ్తున్న సమయంలో దేవిలా ఒక అమ్మాయి కనిపించడంతో వెంటనే రాధ అక్కడికి పరిగెత్తి ఆ అమ్మాయిని గట్టిగా పట్టుకుంటుంది. కానీ చూసేసరికి అక్కడ వేరే అమ్మాయి ఉంటుంది. ఇక రాధ రోడ్డుపై నుంచొని దేవిని తలచుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఒక కారు వేగంగా వస్తుండగా అది గమనించిన ఆదిత్య రాధను కాపాడుతాడు. రాధ మాత్రం దేవి ఎక్కడికి వెళ్లిందా అని ఆలోచిస్తూ ఉంటుంది.

- Advertisement -