Devisri Prasad అప్పుడు లేవని నోరు ఇప్పుడు ఎందుకు అంటూ ఫైర్ అవుతున్న డిఎస్పీ… కారణం ఏంటంటే ?

Jaya Kumar

Devisri Prasad ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన సినిమా ” పుష్ప – ది రైజ్ “. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి అదిరిపోయే మ్యూజిక్ అందించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ హిట్ అందుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం పుష్ప మేనియా కనిపిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో కనిపించగా… అతని ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక నటించి మెప్పించింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే రికార్డ్స్ సృష్టించింది. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ నెట్టింట్లో సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా ఊ అంటావా మావా… ఊహు అంటావా అంటూ సాగే పాట యూట్యూబ్‏లో సంచలనం సృష్టించింది.

ఈ పాటలో సమంత స్టెప్స్, ఎక్స్‏ప్రెషన్స్ కి యూత్ ఫిదా అయ్యారు. అలాగే సింగర్ ఇంద్రావతి చౌహన్ తన గొంతుతో మాయ చేసింది. ఈ పాటలోని లిరిక్స్ మగవాళ్లను కించ పరిచేలా ఉన్నాయంటూ ఏపీ పురుషుల సంఘం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలసిందే. అలానే భక్తిపాట సాహిత్యాన్ని ఇలా ఐటెం సాంగ్ కింద మార్చేశారంటూ ఓ రాజకీయ నాయకుడు విమర్శలు కూడా చేశారు. ఇప్పుడు తాజాగా ఈ విమర్శలపై మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ స్పందించారు. మగాళ్లను అసభ్యంగా చిత్రీకరించే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని… ఈ ఐటమ్ సాంగ్ తో సమాజానికి ఓ మంచి సందేశం ఇచ్చామని అన్నారు.

లిరిక్ రైటర్ చంద్రబోస్, డైరెక్టర్ సుకుమార్ కలిసి ఈ సాహిత్యంతో తన దగ్గర కొచ్చినప్పుడే… ఇలాంటి విమర్శలు వస్తాయని ముందే ఊహించామని చెప్పారు. అయిన కానీ నిజాయితీగా పనిచేశామని ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని చెప్పారు. ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితులను చెప్పాలనుకున్నామని… మగాళ్లను జనరలైజ్ చేసి చెప్పడం తమ ఉద్దేశం కాదని అన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో పాటల్లో మహిళలను అసభ్యంగా చూపించారని, మహిళలను కించేపరిచేలా సాహిత్యం ఉందని… అప్పుడులేని అభ్యంతరం ఇప్పుడెందుకని ప్రశ్నిస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్. ఇక ‘పుష్ప’ ఐటెం సాంగ్ ను పొగుడుతూ చాలా మంది లేడీస్ ఫ్రెండ్స్, మహిళ జర్నలిస్ట్ ల నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయని దేవి వివరించారు. ప్రస్తుతం దేవి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

- Advertisement -