Heroine : కొంతమంది నటీనటులకు వచ్చీరావడంతోనే స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ దక్కించుకున్నప్పటికీ కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో కెరియర్ పోగొట్టుకున్న నటీనటులు చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారు. అయితే తెలుగు ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ మరియు స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తదితరుల కాంబినేషన్ లో తెరకెక్కిన అర్జున్ రెడ్డి చిత్రం ద్వారా తెలుగు చాలా చిత్ర పరిశ్రమ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముంబై బ్యూటీ శాలిని పాండే కూడా ఈ కోవ కే చెందుతుంది. అయితే ఈ అమ్మడు అర్జున్ రెడ్డి చిత్రంలో తన అద్భుతమైన నటనా తీరు అలాగే అందచందాలతో ఆడియన్స్ ని కట్టి పడేసింది. దీంతో ఈ బ్యూటీ కి మంచి ఆరంభం లభించిందని చెప్పవచ్చు.
కానీ శాలిని పాండే మాత్రం ఈ క్రేజ్ ని అలాగే కంటిన్యూ చేయలేకపోయింది. దీనికితోడు ఇప్పటివరకూ ఈ అమ్మడు తెలుగు, తమిళ, మలయాళం, హిందీ తదితర భాషలలొ దాదాపుగా దజనుకు పైగా చిత్రాలలో హీరోయిన్ గా అలాగే ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించినప్పటికి అర్జున్ రెడ్డి, మహానటి చిత్రాలుతప్ప మిగిలిన చిత్రాలు దాదాపుగా డిజాస్టర్ గా నిలిచాయి. దాంతో శాలిని పాండే కూడా ఈ విషయాన్ని త్వరగానే గుర్తించి ఫిట్నెస్ మరియు అందచందాలను మెరగుపర్చుకునేందుకు బాగానే కష్టపడుతోంది. ఈ క్రమంలో దాదాపుగా 10 కేజీలకి పైగా బరువు కూడా తగ్గింది.
అయితే ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు సెలవులను బాగానే ఎంజాయ్ చేస్తూ పలు ఫోటోషూట్లలలో కూడా పాల్గొంటూ ఘాటుగా అందాలు ఆరబోస్తోంది. తాజాగా ఈ అమ్మడు బీచ్ లో బికినీ వేసి దిగినటువంటి ఫోటోలను తన అధికారక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఈ అమ్మడి అందాల ఆరబితాకి ఫిధా అయ్యారు. అంతేగాకుండా అర్జున్ రెడ్డి చిత్రలో నటించిన తర్వాత ఆ రెంజ్ లో హిట్ ని అందుకోలేకపోవడంతోనే స్టార్ హీరోయిన్ కాలేకపోయిందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే శాలిని పాండే కి ఇప్పటికీ సమయం మించిపోలేదని హీరోయిన్ గా ట్రై చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటందని మరికొందరు అంటున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే నటి శాలిని పాండే హిందీలో రణవీర్ సింగ్ హెరోగా నటించిన జయేష్ భాయ్ జోర్దర్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కానీ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు.