Disha Patani : కొంతమందికి తమ నటనా ప్రతిభను నిరూపించుకోవడానికి సరైన ఆఫర్ దక్కక పోయినప్పటికీ అందాల ఆరబోత తో గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారని చెప్పవచ్చు. కాగా ఇలా తమ అందచందాలతో గుర్తింపు తెచ్చుకున్న వారిలో బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ దిశా పటాని ఒకరని దాదాపు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ అమ్మడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొంతకాలం పాటు మోడలింగ్ రంగంలో కూడా పని చేసింది. ఆ తర్వాత టాలీవుడ్ లో ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన లోఫర్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది.
అయితే లోఫర్ చిత్రం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోక పోయినప్పటికీ ఈ అమ్మడికి హీరోయిన్ గా ఆఫర్లు మాత్రం బాగానే తెచ్చిపెట్టింది. అలాగే ఈ ఆఫర్లు కాస్తా బాలీవుడ్ లో రావటంతో దిశా పటాని రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ క్రమంలో నటి దిశా పటాని కొంతకాలంపాటు హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా గడిపింది. కానీ ఈ క్రమంలో కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేక పోయింది. అలాగే ఈ అమ్మడు నటించిన ప్రతి చిత్రంలో బికినీలు, స్పెషల్ సాంగ్స్ అంటూ మితిమీరిన అందాలు ఆరబోసింది. దీంతో నటి దిశా పటాని కి హీరోయిన్ గా కంటే ఎక్కువగా గ్లామర్ డాల్ గా గుర్తింపు వచ్చింది.
ఇంకేముంది… అప్పటివరకూ హీరోయిన్ గా రాణించిన ఈ బ్యుటి ప్రస్తుతం ఆఫర్లు లేక కెరీర్ లో ఇబ్బంది పడుతోంది. కాగా ఈ మధ్య మళ్ళీ ఈ అమ్మడు సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ఆఫర్లు దక్కించుకునేందుకు బాగానే శ్రమిస్తోంది. ఈ క్రమంలో ఎక్కువగా ఫోటో షూట్లలో పాల్గొంటూ బోల్డ్ గా అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ళకి కునుకు లేకుండా చేస్తోంది. అయితే తాజాగా ఈ అమ్మడు బాత్ రూమ్ లో బికినీ దుస్తులు ధరించి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దీంతో ఒక్కసారిగా దిశా పటాని సోషల్ మీడియాలో వైరల్ గ మారింది. అలాగే ఆఫర్ల కోసం ఈ అమ్మడు పడుతున్న కష్టాన్ని గుర్తించండి అంటూ దర్శక నిర్మాతలకు రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఈ అమ్మడి అందాల ఆరబోత కి ఆఫర్లు రాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మాత్రం బాగా పెరుగుతుంది. కాగా ప్రస్తుతం దిశా పటాని అధికారిక సోషల్ మీడియా ఖాతాలను దాదాపు 5 కోట్ల పై చిలుకు మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి.