Divorce విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరో జంట…

Joythi R

Divorce బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో విడాకులు, ప్రేమ వ్యవహారాలు వంటివి చాలా కామన్ గా వినిపిస్తూ ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో ఈ విడాకుల వ్యవహారాలు బాగా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కొంతమంది నటీనటులు పెళ్లయి 20, 30 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత కూడా విడాకులు తీసుకోవడానికి సిద్ధ పడుతుండడంతో కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమకు చెందిన టువంటి మరో ప్రముఖ స్టార్ హీరో విడాకులు తీసుకోవడానికి కోర్టుకెళ్లినట్లు సమాచారం.

పూర్తి వివరాలు లేకపోతే బాలీవుడ్లో పలు చిత్రాలలో హీరోగా విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు సోహైల్ ఖాన్ గురించి సినీ ప్రేక్షకులకు దాదాపుగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటుడు సోహైల్ ఖాన్ బాలీవుడ్ ప్రముఖ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి స్వయానా సోదరుడు. దీంతో సల్మాన్ ఖాన్ తన తమ్ముడు అయిన సోహైల్ ఖాన్ ని ఇండస్ట్రీలో బాగానే ప్రోత్సహించాడు. దాంతో సోహైల్ ఖాన్ కూడా తన నటనా ప్రతిభను నిరూపించుకున్న తనకంటూ కొంత మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

అయితే నటుడు సోహైల్ ఖాన్ మరియు అతడి భార్య సీమా సచ్దేవ్ ఖాన్ తాజాగా ముంబై లో ఉన్నటువంటి కోర్టుకి విడాకులు దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లారు. దీంతో ఒక్కసారిగా ఈ విషయం బాలీవుడ్ సినీ టౌన్ లో కలకలం రేపింది. అలాగే ఈ విషయం గురించి తెలుసుకున్న కొందరు నెటిజన్లు పెళ్లయిన 24 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఉంటాయని కాబట్టి కష్టమైనా సరే కలిసి ఉండటమే మంచిదని నటుడు సోహైల్ ఖాన్ కి సూచిస్తున్నారు. అలాగే చేతికందిన కొడుకు, కూతురు ఉన్న సమయంలో విడాకులు తీసుకుంటే తమ పిల్లల భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుందని కాబట్టి ఈ విషయం గురించి కూడా ఒకసారి ఆలోచించాలని హెచ్చరిస్తున్నారు. మరి సోహైల్ ఖాన్ విడాకుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

ఈ విషయం ఇలా ఉండగా నటుడు సోహైల్ ఖాన్ హిందీలో దాదాపుగా 50 కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించాడు అంతేకాకుండా పలు ధారావాహికలో కూడా తెరపై కనిపించి బాగానే ఆకట్టుకున్నాడు.

- Advertisement -