Divorce : అందుకే నా భార్య కి విడాకులు ఇచ్చాను… లేకుంటే….

Joythi R

Divorce : తెలుగులో తమిళ ప్రముఖ హీరో ధనుష్ హీరోగా నటించిన రఘువరన్ బీటెక్ చిత్రం తెలుగు సినీ ప్రేక్షకులకు బాగానే గుర్తుంటుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా తమిళ ప్రముఖ హీరోయిన్ అమలాపాల్ నటించగా సముద్రఖని, ప్రముఖ స్వర్గీయ నటుడు వివేక్, యంగ్ హీరోయిన్ సురభి, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. అయితే ఈ చిత్రంలో హీరో తల్లి పాత్రలో నటించిన శరణ్య మాత్రం తన ఎమోషనల్ నటనతో సినీ ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో సరైన పాత్ర ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచింది. అయితే సినిమాల్లో తన నటనతో ఎంతగానో ఆకట్టుకునే టువంటి శరణ్య తన వైవాహిక జీవితంలో మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. అయితే నటి శరణ్య భర్త ఎవరో తెలిస్తే అవాక్కవడం మాత్రం ఖాయం.

అయితే నటి శరణ్య భర్త ఎవరో కాదు. తెలుగు ప్రముఖ విలన్ సంపత్ రాజ్. అయితే సంపత్ రాజ్ అంటే టాలీవుడ్ సినీ ప్రేక్షకులకి పెద్దగా తెలియదు. కానీ తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి చిత్రంలోని విలన్ అంటే సినీ ప్రేక్షకులను ఇట్టే గుర్తు పడతారు. కానీ నటుడు సంపత్ రాజ్ మొదటగా పలు తమిళ చిత్రాల ద్వారా తన సినీ కెరీర్ ని మొదలు పెట్టాడు. ఆ తరువాత క్రమక్రమంగా హిందీ, తెలుగు మలయాళం తదితర భాషలలో తన నటనా ప్రతిభను నిరూపించుకునే ప్రస్తుతం బాగానే రాణిస్తున్నాడు. అయితే ఆ మధ్య ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తన భార్య సరైన గురించి పలు ఆసక్తికర విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నాడు.

Sampath Raj about divorce with Saranya
Sampath Raj about divorce with Saranya

తన భార్య 23 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తనతో పెళ్లి జరిగిందని దాంతో తమ లక్ష్యాలను సాధించడానికి సమయం లేకపోవడంతో ఇరువురు బాగా ఇబ్బంది పడ్డామని చెప్పుకొచ్చాడు. అలాగే ఒకానొక సమయంలో తమ వ్యక్తిగత జీవితం మరియు ఉద్యోగ జీవితాన్ని బ్యాలెన్స్ చేయలేక తీవ్ర ఒత్తిడికి గురయ్యారని ఈ క్రమంలోనే తమ ఇరువురు జీవిత లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ఇరువురి అంగీకారంతో విడాకులు తీసుకున్నామని తెలిపాడు. అయితే తన కూతురి సంరక్షణ మాత్రం తానే తీసుకున్నానని ప్రస్తుతం తన కూతురు చదువులు పూర్తి చేసుకుని కెరియర్ ని ఎంచుకొనే పనిలో పడిందని చెప్పుకొచ్చాడు. ఒకవేళ తన కూతురు సినిమా పరిశ్రమలో సెటిల్ అవుతానని చెప్పినా తాను ఖచ్చితంగా ప్రోత్సహిస్తానని తెలిపాడు. అలాగే తాను తన భార్యతో విడాకులు తీసుకున్నప్పటికీ అప్పుడప్పుడు ఫోన్ చేసి తన యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటానని అలాగే తన కూతురు కూడా తన భార్య దగ్గరికి వెళ్లి వస్తుందని చెప్పుకొచ్చాడు.

ఈ విషయం ప్రస్తుతం సంపత్ రాజ్ వరుస సినిమా అవకాశాలతో తన సినీ లైఫ్ లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక శరణ్య కూడా తెలుగు, తమిళం, మలయాళం, తదితర భాషలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ బాగానే రాణిస్తోంది.

- Advertisement -