Ashu Reddy: అషు రెడ్డి పరిచయం అవసరం లేని పేరు టిక్ టాక్ వీడియోల ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె అనంతరం జూనియర్ సమంత గా గుర్తింపు పొందారు కాస్త సమంత పోలికలు కనిపించడంతో అందరూ కూడా ఈమెను జూనియర్ సమంత అంటూ వైరల్ చేయడంతో బాగా ఫేమస్ అయ్యారు. ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.
రెండుసార్లు బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి రావడమే కాకుండా ప్రముఖ సంచలనాత్మక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఈమె చేసినటువంటి బోల్డ్ ఇంటర్వ్యూ పెద్ద ఎత్తున వైరల్ అయింది దీంతో ఒక్కసారిగా ఈమె పాపులర్ అయ్యారు. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే అషు రెడ్డి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తరచు తన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది
ఐటీ ఉద్యోగిని..
ఇదిలా ఉండగా ప్రస్తుతం అషు రెడ్డి పెద్ద ఎత్తున షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజీ సొంతం చేసుకున్నటువంటి ఈమె ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవారన్న సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంది .అయితే ఇండస్ట్రీలోకి రాకముందు ఐటి ఉద్యోగి అనే విషయం చాలా మందికి తెలియదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయాన్ని అషు రెడ్డి వెల్లడించారు. తాను ఐటీ ఎంప్లాయ్ అని తనకు నెలకు 1.2 లక్ష రూపాయల జీతం వచ్చేది అంటూ షాకింగ్ విషయాలు బయట పెట్టారు. ఇలా ఉద్యోగం చేసేటప్పుడు తాను ఇండస్ట్రీలోకి వస్తానని అసలు ఊహించలేదని ఏదో అలా అని జరిగిపోయాయి అంటూ ఈ సందర్భంగా తెలియజేశారు.