Namrata: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి మహేష్ బాబు నటీ నమ్రతను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా పెళ్లి తరువాత నమ్రత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నారు ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సక్సెస్ అందుకున్నప్పటికీ పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు అలా నిర్ణయం తీసుకున్న తర్వాత ఈమె తిరిగి సినిమా ఇండస్ట్రీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు.
ఈ విధంగా మహేష్ బాబుకి భార్యగా కేవలం ఇంటి బాధ్యతలను పిల్లల బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ ఉండడమే కాకుండా పలు వ్యాపార రంగాలలో కూడా రాణిస్తున్నారు. సాధారణంగా నమ్రతకు చాలా ఓపిక సహనం ఎక్కువ కానీ ఈమె కొన్ని సందర్భాలలో అది కూడా తన పిల్లల విషయంలో మహేష్ బాబుతో తరచూ గొడవపడుతుంటారని తెలుస్తుంది. ఇలా మహేష్ బాబుతో పిల్లలు విషయంలో నమ్రత గొడవ పడినప్పుడు మహేష్ బాబు పై ఎంతో కోప్పడతారని తెలుస్తుంది. ఇలా మహేష్ బాబు పై కోపం వచ్చిన సమయంలో నమ్రత చేసే పని గురించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వారి వల్లే మహేష్ నమ్రత గొడవపడతారా…
మహేష్ బాబు మీద నమ్రతకు కనుక కోపం వస్తే ఈమె మహేష్ తో మాట్లాడకుండా నేరుగా షాపింగ్ వెళ్ళిపోతారట. ఇలా కొన్ని గంటల పాటు షాపింగ్ చేసి అనంతరం ఇంటికి తిరిగి వస్తారని అప్పటికే నమ్రత మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుందని అప్పటికే మహేష్ బాబుతో జరిగినటువంటి గొడవ గురించి మరిచిపోయి యధావిధిగా తనతో మాట్లాడతారని తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య పిల్లల గురించి గొడవలు వస్తాయి నమ్రత పిల్లలను క్రమశిక్షణలో పెంచుతూ ఉంటే మహేష్ బాబు మాత్రం పిల్లలకు చాలా సపోర్ట్ చేస్తూ వారిని అన్ని విషయాలలో వెనుకేసుకు రావడంతోనే ఇద్దరి మధ్య గొడవ జరుగుతుందని తెలుస్తుంది.