మనిషి బ్రతకటానికి ఆహారం ఎంత అవసరమో నిద్ర అనేది కూడా చాలా అవసరం. అందువల్ల రోజులు కొంత సమయం నిద్రకు కేటాయించాలి. మనసుకి శరీరానికి ప్రశాంతతనిచ్చే నిద్ర మీద మనిషి ఆయుషు ఆధారపడి ఉంటుంది. అయితే నిద్రపోయే ముందు నిద్ర లేచిన తర్వాత దేవుని స్మరించుకోవాలి. సాధారణంగా ఏ పని చేసినా కూడా అంతా మంచి జరగాలని దేవుని స్మరించుకొని పనులు మొదలుపెడతారు. అలాగే నిద్రపోయేటప్పుడు కూడా ప్రశాంతమైన నిద్రని ప్రసాదించమని దేవున్ని స్మరించుకోవాలి. అయితే నిద్రపోయేముందు నిద్రలేచిన తర్వాత ఏ దేవుని స్మరించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతిరోజు రాత్రి వేళల్లో మనిషి నిద్రపోయే ముందు ఆ పరమేశ్వరుడిని స్మరిస్తూ నిద్రపోవాలి. ఎందుకంటే పరమేశ్వరుడు లయకారుడు. ప్రతిరోజు శివనామ స్మరణ చేస్తూ ఆ శివుని స్మరిస్తూ నిద్రపోవడం వల్ల ఎటువంటి పీడకలలు రాకుండా ప్రశాంతమైన నిద్రని ప్రసాదిస్తాడు. అందువల్ల ప్రతిరోజు నిద్రకు ఉపక్రమించే ముందు తప్పనిసరిగా శివ నామ స్మరణ చేస్తూ నిద్రపోవాలని పండితులు చెబుతున్నారు. అలాగే ఉదయం నిద్ర లేచిన వెంటనే దైవాన్ని స్మరించుకోవాలని
పండితులు చెబుతున్నారు.
ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే శ్రీమహావిష్ణువు ను స్మరించుకోవాలి అని పండితులు చెబుతున్నారు. శ్రీమహావిష్ణువు స్థితికారుడు. ఆయన రోజంతా మనల్ని ఆనందంగా, క్షేమంగా ముందుకి నడిపిస్తాడు. ఉదయం నిద్రలేచిన వెంటనే విష్ణు నామం స్మరిస్తూ నిద్రలేవాలి. ఆ తర్వాత రెండు అరచేతులను రుద్ది కళ్ళకు అడ్డుకొని ఆ తర్వాత మొదటగా అరచేతులని చూడాలి. ఎందుకంటే మన అరచేతులలో లక్ష్మీ, సరస్వతి, గౌరీ దేవి కొలువై ఉంటారు. ప్రతిరోజు విష్ణు నామ స్మరణ చేస్తూ నిద్రలేవటం వల్ల ఆ రోజు మొత్తం ఆనందంగా ఉంటుంది.