Esther Anil తెలుగులో ప్రముఖ దర్శకుడు జీతూ జోసఫ్ దర్శకత్వం వహించిన దృశ్యం మూవీ మంచి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, తదితర భాషలలో కూడా రీమేక్ చేసి విడుదల చేయగా ఫ్యాన్ ఇండియా లెవెల్ లో మంచి హిట్ అయింది. ఫ్యామిలీ ఓరియెంటెడ్ క్రైమ్ థ్రిల్లర్ తరహాలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో ఇప్పటికే రెండు భాగాలు విడుదల చేశారు. దీంతో తొందరలోనే దృశ్యం మూడవ భాగం కూడా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో తెలుగులో మరియు తమిళ భాషలలో కలిపి హీరో కూతురు పాత్రలో యంగ్ చైల్డ్ ఆర్టిస్ట్ ఎస్తర్ అనీల్ నటించింది. కాగా ఈ అమ్మడు తన ఇన్నోసెంట్ నటన తో ప్రేక్షకులను ఫిదా చేసింది.
అయితే ఈ మధ్యకాలంలో నటి ఎస్తర్ అనీల్ కి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించే వయసు దాటిపోవడంతో హీరోయిన్ ఆఫర్లు కోసం బాగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ అమ్మడు పలు రకాల ఫోటోషూట్లలో మరియు ఈవెంట్లలో పాల్గొంటూ అందాల ఆరబోతతో దర్శక నిర్మాతలను ఆకర్షిస్తుంది. కాగా తాజాగా నటి ఎస్తర్ అనీల్ ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన ఈవెంట్ లో పాల్గొని ఘాటుగా అందాలు ఆరబోస్తూ స్కిన్ షో, క్లీవేజ్ షో వంటివి చేస్తూ నెటిజన్లను కట్టిపడేసింది. దీంతో ఈ అమ్మడి అందాల ఆరబోతకు నెటిజన్లు ఫిదా అయ్యారు. అలాగే ఎస్తర్ అనీల్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే టైమ్ ఆసన్నమైందని కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఈ అమ్మడికి నటనలో మంచి ప్రతిభ ఉందని కాబట్టి కథల పట్టా మరియు కెరియర్ పట్ల సరైన నిర్ణయాలు తీసుకుంటే ఇండస్ట్రీలో మంచి ఫ్యూచర్ ఉంటుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా నటి ఏస్తర్ అనిల్ తెలుగులో జోహార్, దృశ్యం, దృశ్యం -2 తదితర చిత్రాల్లో నటించింది. అయితే ఈ అమ్మడు తెలుగులో నటించింది తక్కువ చిత్రాల్లోనే అయినప్పటికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ ని సంపాదించుకుంది. కాగా ప్రస్తుతం ఏస్తర్ అనిల్ మలయాళంలో ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న జాక్ అండ్ జిల్ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తుంది. తాజాగా ఈ అమ్మడు తమిళ సినీ పరిశ్రమకి చెందిన ఓ ప్రముఖ హీరో సరసన రెండో హీరోయిన్ గా నటించే ఆఫర్ దక్కించుకున్నట్లు సమాచారం..