ప్రస్తుతం కరోనా వేళ అందరూ ఇంటికే పరిమతమైన పరిస్థితి ఉంది. ఇందుకు నటీ నటులు కూడా ఏ మాత్రం మినహాయింపు కాదు. ఎందుకంటే మొదట కొద్ది రోజులు పరిమిత సంఖ్యలో షూటింగ్ లకు అనుమతినిచ్చినా ఇక అలా షూటింగ్ లు జరపడం సాధ్యపడలేదు. అయినా సినిమా సభ్యులలో ఎవరో ఒకరు కరోనా బారిన పడుతుండటంతో ఇక షూటింగ్ లను నిలిపివేశారు. అయితే ఇక అందరు నటులు ఇంటి పట్టున ఉంటూ లాక్ డౌన్ ను తమ కుటుంబ సభ్యుల మధ్య సరదాగా గడుపుతున్నారు. ఇక రచయితలు, దర్శకులు తమ స్క్రిప్ట్ లకు మరింత మెరుగులు దిద్దుతున్నారు. అయితే నటి పూజా హెగ్డే లాక్ డౌన్ ఎలా ఎంజాయ్ చేస్తుందనే దానిపై ఓ వార్త ప్రచారంలో ఉంది. నటి పూజా హెగ్డే లాక్ డౌన్ కావడంతో ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ కుటుంబ సభ్యులతో గడుపుతున్న ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. అయితే పూజా హెగ్డే మాత్రం లాక్ డౌన్ లో ఖాళీ ఉండకుండా తన తరువాత సినిమా స్క్రిప్ట్ లపై దృష్టి పెట్టింది.
మంచి కథలకు మాత్రమే ఓటేస్తున్న పూజాహెగ్డే
స్క్రిప్ట్ లను వింటూ ఇక కరోనా ముగియగానే వరుస సినిమాలను పట్టాలెక్కించేందుకు పావులు కదుపుతోంది. అయితే ఇప్పటికే తమిళం, తెలుగు సినిమాలలో అప్ కమింగ్ ప్రాజెక్టులలో పూజా హెగ్డే నటించనున్నట్లు తెలుస్తుంది. లాక్ డౌన్ లో ఉన్నప్పుడే మంచి స్టోరీలను సెలెక్ట్ చేసుకోవడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు.ఎందుకంటే ఒక వేళ స్టోరీలో మార్పులు, చేర్పులు ఉన్నా అంతేకాక స్క్రిప్ట్ పరంగా సూచించిన మార్పులు చేర్పులు చేసుకోవడానికి తగినంత సమయం దొరుకుతుంది. అందుకే ఒక పూజా హెగ్డేనే కాక మంచి కథలను ఎన్నుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.దీంతో పూజా హెగ్డే కుటుంబంతో సమయం కేటాయిస్తూనే ఇంకో రెండు, మూడేళ్లు సూపర్ హిట్ సినిమాలలో నటించడానికి ప్లాన్స్ వేస్తోంది. నచ్చని కథలను ఏ మాత్రం మొహమాటం లేకుండా రిజెక్ట్ చేస్తున్న పూజా హెగ్డే నచ్చిన కథలకు మాత్రం ఒకే చెబుతున్నట్టు తెలుస్తోంది.