Film Industry చిత్ర పరిశ్రమ లో పెళ్లిళ్లు ఎంత త్వరగా జరుగున్నాయో విడాకులు కూడా అలానే జరుగుతున్నాయి. చూడ ముచ్చట జంట అనుకున్నంతనే… విడిపోతున్నట్లుగా షాకుల మీద షాకులు ఇస్తున్నారు సినీ జంటలు. బాలీవుడ్ లో ఎక్కువగా కనిపించే ఈ విడాకుల కల్చర్ సౌత్ కు వచ్చేసింది. మొన్నటికిమొన్న క్యూట్ కఫుల్ గా పేరున్న నాగచైతన్య, సమంతలు పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లుగా చెప్పి అందరిని షాకిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో చూడచక్కని జంట విడిపోయినట్లుగా ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, హీరో ధనుష్ దంపతులు విడాకులు తీసుకున్నారు. తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు వీరిద్దరూ సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
ఈ వార్త విని రజనీకాంత్, ధనుష్ అభిమానులు షాకయ్యారు. ఎంతో అనోన్యంగా కలిసి ఉండే ధనుష్-ఐశ్వర్యలు విడాకులు తీసుకోవడం ఏంటని నివ్వెరపోయారు. అసలు వీరి పెళ్లి ఎలా జరిగింది ? వీరిద్దరి లవ్‌స్టోరీ ఏంటి? అనేది వెతకడం ప్రారంభించారు నెటిజన్స్. ధనుష్, ఐశ్వర్యలది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. 2004లో ఇరుకుటుంబాల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ధనుష్ సినిమా కాదల్ కొండై విడుదలైన సమయంలో వీరికి పరిచయం ఏర్పడింది. థియేటర్‌కి వెళ్లి సినిమా చూసిన ఐశ్వర్యను ధనుష్‌కి పరిచయం చేసింది చిత్ర యూనిట్. ఆ సమయంలో ధనుష్‌కు అభినందనలు తెలిపింది ఐశ్వర్య. ఆ మరుసటి రోజు ధనుష్‌కి ఒక బోకే పంపిస్తూ… టచ్ లో ఉండమని చెప్పింది. కొన్నాళ్ల తర్వాత వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. అది కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది.
మేము స్నేహితులుగా ఉన్న సమయంలోనే మేము ప్రేమలో ఉన్నట్లు కథనాలు వచ్చాయి. కొన్నాళ్ల తర్వాత ఒకరినొకరం ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయాన్ని మా కుటుంబ సభ్యులకు తెలిపి.. వారి అంగీకారంతోనే వివాహం చేసుకున్నాం’ అని గతంలో ఓ ఇంటర్యూలో ధనుష్ చెప్పారు. 2004, నవంబరు 18న వీరిద్దరి వివాహం జరిగింది. అప్పుడు ధనుష్ వయసు కేవలం 21 మాత్రమే. ధనుష్ కంటే ఐశ్వర్య రెండేళ్లు పెద్ద. వీరికి యాత్రా రాజా, లింగ రాజా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం ధనుష్ – ఐశ్వర్య విడాకుల వార్త మీడియా లో ట్రెండింగ్ గా నడుస్తుంది.
????? pic.twitter.com/hAPu2aPp4n
— Dhanush (@dhanushkraja) January 17, 2022