Pawan Kalyan : పవన్ హీరోయిన్ పై పోలీస్ కేసు నమోదు… అలా చేస్తుందంటూ పాపం….

Joythi R

Pawan Kalyan : తెలుగులో ప్రముఖ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఖుషి చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ప్రముఖ వెటరన్ హీరోయిన్ భూమిక హీరోయిన్ గా నటించగా మరో హీరోయిన్ అయిన ముంతాజ్ చిన్నపాటి గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలో నటించింది. ఈ చిత్రం మంచి హిట్ అయినప్పటికీ నటి ముంతాజ్ ఇది మాత్రం పెద్దగా కలిసి రాలేదు. దీనికితోడు నటి ముంతాజ్ ఎక్కువగా తను నటించినటువంటి చిత్రాలతో కంటే వివాదాలతోనే పాపులర్ కావడంతో ఈ అమ్మడుకు పెద్దగా సినిమా ఇండస్ట్రీలో క్లిక్ కాలేకపోయింది. అయితే తాజాగా నటి ముంతాజ్ గృహ హింస చట్టం కేసులో ఇరుక్కున్నట్లు సమాచారం.

గత కొన్ని సంవత్సరాలుగా తమిళనాడు రాష్ట్రంలోని అన్నా నగర పరిసర ప్రాంతంలో నివాసముంటోంది. ఈ క్రమంలో నటి ముంతాజ్ ఇంట్లో బతుకు దెరువు కోసం వలస వచ్చినటువంటి కొందరు పని చేస్తున్నారు. అయితే ఇందులో కొంతమంది మైనర్ బాలికలు కూడా ఉన్నారు. కాగా తాజాగా ఈ మైనర్ బాలికలు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ నటి ముంతాజ్ వారిని కావాలని పంపించకుండా విసిగిస్తున్నట్లు సమాచారం.

 

దీంతో సదురు మైనర్ బాలికలు కాస్త 100 కి ఫోన్ చేసి తమ యజమానురాలైన ముంతాజ్ తమ స్వగ్రామాలకు వెళ్లనివ్వకుండా బాగా ఇబ్బంది పెడుతోందని కాబట్టి తమను రక్షించాలని పోలీసులను కోరారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు ఇంటికి వెళ్లి మైనర్ బాలికలను అదుపులోకి తీసుకొని పునరావాస కేంద్రానికి తరలించారు. అలాగే నటి ముంతాజ్ పై గృహ హింస చట్టం కింద కేసు కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో మరోమారు నటి ముంతాజ్ వార్తల్లో నిలిచింది. కానీ ఇప్పటివరకు నటి ముంతాజ్ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు.

Pawan Kalyan :  పవన్ హీరోయిన్ పై పోలీస్ కేసు నమోదు... అలా చేస్తుందంటూ పాపం....
Pawan Kalyan : పవన్ హీరోయిన్ పై పోలీస్ కేసు నమోదు… అలా చేస్తుందంటూ పాపం….

ఈ విషయం ఇలా ఉండగా దాదాపుగా 50 కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించడం హీరోయిన్ గా మాత్రం క్లిక్ కాలేకపోయింది. అంతేకాకుండా ఆ మధ్య 2, 3 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి నష్ట పోయినట్లు సమాచారం. దీంతో అప్పటి నుంచి నటి ముంతాజ్ సినిమా ఇండస్ట్రీ కార్యకలాపాలకు కొంతమేర దూరంగా ఉంటోంది.

 

- Advertisement -