Fire Dosa: భోపాల్‌: మ‌న‌కు మ‌సాలా దోశ తెలుసు.. ప్లెయిన్ దోశ, ఆనియ‌న్ దోశ తెలుసు.. ఆఖ‌రికి ఎగ్ దోశ, క్యార‌ట్ దోశ కూడా తెలుసు.. కానీ ఫైర్ దోశ గురించి ఎప్పుడైనా విన్నారా..? దక్షిణాది అల్పాహారమైన దోశ ఉత్తరాదికి చేరి అనేక మార్పులు చెందింది. అక్క‌డి వ్యాపారులు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త రకం దోశలను త‌యారు చేస్తున్నారు. చీజ్, బటర్‌, కూరగాయలను ఉపయోగించి రకరకాల దోశల రుచి చూపిస్తున్నారు. అదేవిధంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఇండోర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి ఫైర్ దోశ పేరుతో ఒక కొత్త ర‌కం దోశ‌ను అందుబాటులోకి తెచ్చాడు.

ఇండోర్‌కు చెందిన అమర్ శిరోహీ అనే ఫుడ్ బ్లాగర్ ఇటీవల ఈ దోశ తయారీ వీడియోను ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో దోశ‌ పిండిని పెనం మీద వేసిన తర్వాత బటర్, కారం పొడి, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, టమాటా, మొక్క జొన్న గింజలు, కొత్తిమీర చల్లాడు. తర్వాత లిక్విడ్ చీజ్, టమోటా సాస్ వేసి దోశ అంతటా పూశాడు. ఆ తర్వాత దోశను ఐదు భాగాలు చేశాడు. తర్వాత ఫ్యాన్ ద్వారా మంటను పెంచి దోశను తిర‌గేయ‌కుండానే పై భాగం కూడా మంట‌తో కాలేలా చేశాడు.

ఆ త‌ర్వాత కూడా మరోసారి చీజ్ వేసి బాగా కాల్చాడు. అనంత‌రం దోశ ముక్కలను గుండ్రంగా చుట్టాడు. గుండ్ర‌ని దోశ‌ల‌కు మరోసారి లిక్విడ్ చీజ్, చీజ్ వేసి క‌స్ట‌మ‌ర్‌కు అందించాడు. మొత్తానికి ఈ దోశ‌లో చీజ్ ఎక్కువ‌గా వినియోగించాడు. కాగా, ఈ దోశ త‌యారీకి సంబంధించిన వీడియోను మీరు కూడా ఒక‌సారి వీక్షించండి.

View this post on Instagram

A post shared by Amar Sirohi (@foodie_incarnate)

 

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 26, 2021 at 10:22 ఉద.