Gandipeta Rahasyam: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలైన తర్వాత ఎన్నో రకాల వివాదాలను ఎదుర్కొంటుంది. ఈ విధంగా ఏదో ఒక కారణం చేత వివాదాలను ఎదుర్కొన్న సినిమాలు కోకొల్లలుగా ఉంటాయి. అయితే ప్రస్తుతం ఇలాంటి వివాదాలు మరికాస్త ఎక్కువయ్యాయని చెప్పాలి ప్రతి ఒక్క సినిమాలోనూ ఏదో ఒక వివాదం సంఘటనను వెలికితీస్తూ పెద్దఎత్తున రచ్చ చేస్తున్నారు. ఈ విధంగా గతంలో గండిపేట రహస్యం సినిమా కూడా తీవ్రస్థాయిలో వివాదాలను ఎదుర్కొంది.
ఎం ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో డివియన్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం గండిపేట రహస్యం. ఇందులో విజయ నిర్మల ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో నటించిన ఈ నటుడు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ గా కొనసాగుతున్నారు. మరి గండిపేట రహస్యంలో ఎన్టీఆర్ పాత్రలో నటించిన ఆ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా. అవునండి ప్రస్తుతం 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు పృథ్వి గండిపేట రహస్యం సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో అద్భుతంగా నటించారు.

Gandipeta Rahasyam: కమెడియన్ పృథ్వీ రాజ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్టీఆర్ అభిమానులు..
ఈ సినిమాలో ఎన్టీఆర్ ను కాస్త చెడు స్వభావం ఉన్న వ్యక్తిగా చూపించారు. ఇక ఈ సినిమాలో పృధ్విరాజ్ ఎన్టీఆర్ పాత్రలో నటించినందుకు గాను ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో ఈ సినిమా విడుదల అయి బాక్సాఫీసు వద్ద ఎన్నో వివాదాలు ఎదుర్కొంది. ఇక ఇందులో నటించిన పృద్వి రాజ్ ను ఏకంగా చంపేస్తామంటూ బెదిరింపులు కూడా వచ్చాయి. ఈ విధంగా ఎన్టీఆర్ పాత్రలో ఎంతో ఒదిగిపోయి నటించిన పృద్విరాజ్ నటనకు కొందరి నుంచి మంచి ప్రశంసలు అందినప్పటికీ కొందరు ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో వివాదం సృష్టించారు.అప్పట్లో ఈ సినిమా తీవ్ర వివాదాల్లో చిక్కుకొని పెద్దఎత్తున వార్తల్లో నిలిచింది.