Gold Price: ఎన్నటికీ బంగారం విలువ తగ్గదు. కాలం ముందుకు పోతున్న కొద్ది బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే భూమిపై బంగారంతో అంత డిమాండ్ ఉంది కాబట్టి. ముఖ్యంగా మన దేశంలో బంగారం ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి చిన్న వేడుకైనా సరే గ్రాము బంగారం తీసుకోవడానికి ముందుకు వస్తారు.
అయితే గత కొన్ని రోజుల నుండి బంగారం ధరలు బాగా మండిపోవడంతో బంగారం కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు కాస్త వెనుకాడుతున్నారు. ఎప్పుడెప్పుడు ధరలు తగ్గుతాయా అని ఎదురు చూస్తున్నారు. ఇక ఇన్ని రోజులు మండుతున్న ధరలు చూసిన వాళ్లకు ఈరోజు కాస్త ఊరట లభించింది అని చెప్పవచ్చు. ఈరోజు ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. వెండి ధరలు యధావిధిగా ఉన్నప్పటికీ కూడా బంగారం ధరలు కాస్త తగ్గాయి.
హైదరాబాద్ లో ఈరోజు బంగారం ధరలు చూసినట్లయితే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 53,100 రూపాయలుగా ఉంది. నిన్న 53,610 గా ఉండగా ఈ రోజు కాస్త తగ్గింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,930 రూపాయలుగా ఉంది. నిన్న రూ.58,480 గా కొనసాగింది. మన దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈరోజు 53,250గా ఉంది.
Gold Price
నిన్న మాత్రం రూ. 53,760 గా కొనసాగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 58,080 రూపాయలుగా ఉంది. ఇక నిన్న 58,620గా కొనసాగింది. అయితే ధరలు ఇప్పుడు ఇలా తగినప్పటికీ కూడా.. కొన్ని సంస్థల ద్వారా భవిష్యత్తులో బంగారం 10 గ్రాములకు 60,000 పలకునున్నట్లు తెలుస్తుంది. కాబట్టి బంగారం కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు ఇప్పుడే ద్వారా పడటం మంచిది. లేదంటే భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది.