Gold Price: మొత్తానికి పెళ్లి సీజన్లలో అడుగుపెట్టేసాం. ప్రతి ఒక్కరు బంగారం కొనుగోలు చేయటానికి బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మంచి ముహూర్తాలు రావటంతో కేవలం పెళ్లిళ్లు కాకుండా ఇతర వేడుకలు కూడా జరగనున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయడానికి జనాలు ముందుకు వస్తున్నారు. ధర ఎక్కువగా ఉన్న కూడా బంగారం షాపులలో జనాలు కిటకిటలాడుతున్నారు.
గత కొన్ని రోజుల నుండి మాత్రం బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నిజానికి ఒక రేంజ్ లో భగ్గుమన్నాయని చెప్పాలి. దీంతో కొంతమంది ప్రజలు బంగారం కొనుగోలు చేయడానికి కాస్త వెనుకడుగే వేశారు. దీంతో ధరలు ఎప్పుడు తగ్గుతాయో అని ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు. ఇక నిన్నటి వరకు ధరలు కాస్త ఎక్కువగానే ఉండగా ఈరోజు మాత్రం కాస్త తగ్గుముఖం పట్టింది. వెండి ధర మాత్రం నిన్నటి రేటులోనే ఉంది.
ఇక ఈరోజు గ్రాము బంగారం ధర చూసినట్లయితే రూ.5,250 ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,270 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,930 గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,420 గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,500 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,270 గా ఉంది.
Gold Price:
ఇక మిగతా ప్రాంతాలలో కూడా ధరలు వీటికి దగ్గర దగ్గరగానే ఉన్నాయి. ఇక వెండి ధరలు చూసినట్లయితే ఈరోజు గ్రాము వెండి ధర రూ.72.60 ఉండగా.. కేజీ వెండి ధర రూ.72,600 గా ఉంది. మొత్తానికి బంగారం ధరలు తక్కువగా ఉండగా బంగారం కొనుగోలు చేసే ప్రియులు బంగారం షాపుల వెంట క్యూ కట్టారు.