Gold Price: రోజురోజుకు బంగారం విలువ పెరిగిపోతుంది. క్షణాల్లో ధర తరుగుతూ, పెరుగుతూ అందర్నీ దడ పుట్టిస్తుంది. ఇప్పటికే ధరలు పెరుగుతూ ఉండగా ముందు ముందు కూడా ధరలు పెరిగే అవకాశం ఉన్నాయని తెలుస్తుంది. దీంతో ఈ బంగారం ధరలు చూసి బంగారం ప్రియులు కొనుగోలు చేయాలన్నా కూడా భయపడిపోతున్నారు. ఈ ధరలను చూసి సామాన్య, మధ్య ప్రజలు తమ కార్యాల కోసం కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు.
అంతర్జాతీయంగా పసిడి ధరలు పడిపోతున్నప్పటికీ కూడా మనదేశంలో మాత్రం ధరలు పెరుగుతూ తగ్గుతూ ఉన్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్ కు 1860 డాలర్ల వద్ద ఉంది. దీని ప్రకారం చూసినట్లయితే ధర కాస్త తగ్గినట్లు అనిపించినా కూడా భవిష్యత్తులో మాత్రం పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఈరోజు 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం మీద రూ.150, స్వచ్ఛమైన బంగారం మీద రూ.160 పెరిగినట్లు ఉంది.
Gold Price:
ఇక హైదరాబాదులో ఈరోజు ధరలు చూసినట్లయితే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,710 గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52, 900 గా ఉంది. ఇక విజయవాడ లో కూడా ఇదే ధర కొనసాగుతుంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే మార్కెట్లో గ్రాము వెండి ధర రూ.70.80 గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ.70,800 గా ఉంది. హైదరాబాదులో రూ.72,500 గా ఉంది. మొత్తానికి ఈ పసిడి ధరలు చూసి బంగారం కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు కాస్త ఆలోచనలో పడుతున్నారు. కానీ భవిష్యత్తులో మాత్రం బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని.. ఇక ముందు ముందు బంగారం కొనుగోలు చేయాలి అంటే కష్టమే అని తెలుస్తుంది.