Gold Price: బంగారం ధరలు గత కొన్ని రోజుల నుంచి బాగా పెరుగుతూ ఉన్నాయి. రోజురోజుకు ధరలు తగ్గుతాయన్న ఆశలో ఉన్న ప్రజలకు మరింత పెరుగుతూ షాక్ లు ఇస్తున్నాయి. పైగా ప్రస్తుతం పెళ్లిల సీజన్ కాబట్టి చాలా మంది బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారు. కానీ.. ధరలు పెరుగుతున్న కొద్ది వెనుకడుగు వేస్తూనే ఉన్నారు.

అయితే ఈరోజు కూడా బంగారం ధర పెరిగింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు ఈ ధరను చూసి నివ్వెరపోతున్నారు. ఈ ధరలను చూసి ఇప్పటంతల బంగారం కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కూడా వదిలేశారు. ముందు చూస్తే పెళ్లిల సీజన్ దగ్గరికి రావడంతో కొందరు తప్పదు అన్నట్లుగా కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. మరికొందరు భవిష్యత్తులో ఏమైనా తగ్గే అవకాశాలు ఉంటాయన్న ఆశతో ఎదురుచూస్తున్నారు.

ఇక కేవలం బంగారమే కాదు వెండి ధర కూడా పెరుగుతూ షాక్ ఇస్తుంది. అయితే ఈ రోజు బంగారం ధరలు చూస్తే నిన్నటి కంటే ఎక్కువగానే పెరిగాయి. ఇక ఈరోజు గ్రాము బంగారం ధర రూ.5,235 కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పై రూ. 52,350 గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ. 56,730కు చేరుకుంది. హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,400 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,160 లో ఉంది.

Gold Price:

ఇక వెండి ధరలు చూసినట్లయితే గ్రాము వెండి ధర ఈరోజు రూ.72,10 ఉండగా.. మార్కెట్లో కేజీ వెండి ధర రూ.72,100 లో ఉంది. ఇక ఈ ధరలు మళ్ళీ ఎప్పుడు పెరుగుతాయో తగ్గుతాయో తెలియదు కానీ స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చులు తగ్గులు ఉంటాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే వాళ్ళు వీటి ధరలు ఎప్పటికప్పుడు గమనించి కొనుగోలు చేయాలి.