Gold Rate: భారతదేశంలోనే ఖరీదైన మెటల్ గోల్డ్. ప్రత్యేకంగా భారతీయ స్త్రీలకు బంగారానికి విడదీయరాని అనుబంధం. రోజుకి బంగారం వెండి ధరల రేట్లు పెరుగుతూ సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. రేట్లు ఆకాశంవైపే గాని నేలచూపులు చూడనంటూ మధ్యతరగతి మహిళలని ఊరిస్తున్నాయి.
గోల్డ్ ని ఆభరణాల కోసమే కాకుండా పెట్టుబడుల కోసం కూడా కొని నిల్వ చేయటం వలన కూడా బంగారానికి అంత డిమాండ్ ఏర్పడింది. ధరలు పెరగటం అనేది భారతీయ మహిళలకి ఇబ్బంది కలిగినప్పటికీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా బంగారాన్ని కొని నిల్వ చేస్తున్నారు. రాబోయే సీజన్ పెళ్లిళ్ల సీజన్ కావటంతో రేటు ఎంత ఉన్నప్పటికీ కొనటానికి వెనుకడుగు వేయడం లేదు ప్రజలు.
ఇక ఈరోజు బంగారం రేటుకి వస్తే గ్రాము ధర రూ.5,380 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.53,800. 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,690 గా నమోదయింది. దేశంలోని వివిధ నగరాల్లో నేటి బంగారం రేటు ఎలా ఉందో చూద్దాం. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,800 కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58690గా నమోదయింది.
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,600 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,470 నమోదయింది. దేశ వాణిద్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,800 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,690గా నమోదయింది. ప్రధాన నగరమైన ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,950 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,840గా నమోదయింది.ఇక హైదరాబాదులో 22 బంగారం ధర రూ.53,800 నమోదు కాగా.
Rate:
24 క్యారెట్ల బంగారం ధర రూ.58,690గా నమోదయింది. మరోవైపు వెండి రేట్లు కూడా బంగారం రేటు తోనే పరిగెడుతున్నాయి. ఒకసారి వాటి వైపు కూడా దృష్టి పెడదాం. ఈరోజు గ్రామం వెండి ధర రూ.69.80 గా నమోదయింది. ఇక కేజీ వెండి మార్కెట్లో రూ.69,800గా నమోదయింది. ఈ ధరలు మార్చి 17 ఉదయం 10:45 గంటల సమయానికి నమోదైన ధరలు. ఇవి ప్రాంతాన్ని బట్టి, సమయాన్ని బట్టి మారుతూ ఉంటాయి.