Gold Rate: ప్రస్తుతం ఎండలు ఎంత ఎక్కువగా మండిపోతున్నాయో మన అందరికీ తెలిసిందే దాంతోపాటు బంగారం, వెండి రేట్లు కూడా అలాగే మండిపోతున్నాయి. తరచి చూస్తే సామాన్యుడికి దరిదాపుల్లో లేవు ఈ రేట్లు. కాగా ఈరోజు రేట్లు మరింత పెరిగి జనాలని బెంబేలెక్కిస్తున్నాయి. మరి ఈరోజు ఏ ఏ ప్రాంతాల్లో రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం రండి.
ఈరోజు ఉదయం 10 :20 (14 -4-2023) కి ఉన్న ధరల ప్రకారం ఈరోజు గ్రాము బంగారం ధర రూ.5,665 రూపాయలుగా నమోదయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.56,650 కాగా 24 క్యారెట్ల బంగారం రూ.61,800గా నమోదయింది. దేశం మొత్తంలో చూసుకుంటే వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,650 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61, 800 గా నమోదయింది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.55,850 రూపాయలుగా నమోదు అయితే 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,910 గా నమోదయింది.
కోల్కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,650 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.61, 800 గా నమోదయింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200గా నమోదు అయితే 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,400గా నమోదు అయింది. ఇక బెంగళూరు విషయానికి వస్తే 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,700 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.61, 850 గా నమోదయింది.
ఇక మన హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,650 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,800 గా నమోదయింది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,650 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,800 గా నమోదయింది. ఇక విశాఖపట్నంలో కూడా ఇంచుమించు ఇవే రేట్లు నడుస్తున్నాయి.
Gold Rate:
ఇదే వెండి విషయానికి వస్తే గ్రాము ధర రూ.79,60 గా నమోదయింది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి రూ.79,600గా నమోదయింది. కోల్కతాలో కేజీ వెండి రూ.79,600 రేటు పలకగా బెంగళూరు హైదరాబాదులలో రూ.83,000 గా నమోదయింది.