Gopichand: గోపీచంద్ తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మెప్పిచడమే కాకుండా విలన్ పాత్రలలో కూడా నటించి తన విలనిజాన్ని అందరికీ పరిచయం చేశారు. అయితే ఈ మధ్యకాలంలో గోపీచంద్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా భారీగా డిజాస్టర్ అవుతుండడంతో ఈయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గోపీచంద్ శ్రీనువైట్లతో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే.
గోపీచంద్ సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవడంతో ఈయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎవరు కూడా ముందుకు రావడం లేదు ఇలాంటి తరుణంలోనే గోపీచంద్ సినిమా అవకాశాలను కోల్పోతున్నారు అయితే సినిమా అవకాశాలను అందుకొని ఎలాగైనా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోవాలని భావిస్తున్నటువంటి ఈయన తన రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలకు చాలా వెసులుబాటు కల్పించారని తెలుస్తుంది. గోపీచంద్ రెమ్యూనరేషన్ విషయంలో చాలా రెమ్యూనరేషన్ తగ్గించుకున్నారని చెప్పాలి.
శాలరీ రూపంలో రెమ్యూనరేషన్…
ఈ విధంగా రెమ్యూనరేషన్ తగ్గించుకోవడమే కాకుండా తాను సినిమాలలో కనుక నటిస్తే తనుకు రెమ్యూనరేషన్ ఒకేసారి కాకుండా నెలనెలా సాలరీ రూపంలో ఇచ్చే వెసులుబాటు కూడా కల్పించారు. ఇలా సినిమా కోసం తాను ఎన్ని నెలలు అయితే పని చేస్తారో అన్ని నెలలకు సాలరీ రూపంలో తన రెమ్యూనరేషన్ ఇస్తే చాలని నిర్మాతలతో డీల్ కుదుర్చుకున్నారట తనకు సినిమా అవకాశాలు వస్తాయని సినిమా అవకాశాలను అందుకొని సక్సెస్ సాధించడం కోసమే రెమ్యూనరేషన్ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. ఇలా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించడం కోసం గోపీచంద్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తెలిసి అభిమానులు ఎంతో ఆందోళన చెందుతున్నారు.