మళ్లీ పొగరు చూపించిన నిత్యా మీనన్. మీమ్ స్టార్ కు మండిపోయిందట.. ఒకటే వివాదం!

Akashavani

తెలుగు ప్రేక్షకుల కు హీరోయిన్ నిత్యా మీనన్ ను గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అలా మొదలైంది సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మరో లెవెల్లో ఆకట్టుకుంది.

ఇటీవల పవన్ కళ్యాణ్ బీమ్లా నాయక్ సినిమాలో పవన్ భార్యగా ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకుంది. ఇదంతా పక్కన పెడితే ఇండియన్ ఐడల్ అంటూ ఆహా ఓటీటీ సంస్థ తెలుగు ప్రేక్షకుల ముందుకు ఒక రియాలిటీ షోను తీసుకోవచింది. ఇక ఈ షో కు ఓటీటీ ప్రేక్షకులతో మంచి ఆదరణ పొందింది. ఇక ఈ షోలో జడ్జీలుగా నిత్యామీనన్, ఎస్ తమన్, సింగర్ కార్తిక్ లు వ్యవహరిస్తున్నారు.

ఇక ఈ షో లో కేవలం సాంగ్స్ ఉంటే జనాలు అంతగా చూడడానికి ఇంట్రెస్ట్ చూపరు. సో.. మధ్య మధ్యలో కాస్తా డ్రామా యాడ్ చేసి ప్రేక్షకులకు ఇంట్రెస్టింగ్ గా ఉండేలా చేస్తున్నారు. ఇక ఇందులో భాగంగా ఒక పర్ఫామెన్స్ మేటర్ లో నిత్య మీనన్ కు తమన్ కు మధ్య ఒక పెద్ద క్లాష్ జరిగింది. కాగా వీరిద్దరి మధ్య కొంత సీరియస్ గానే చర్చ నడిచింది.

nithya menen: థమన్, నిత్యా మీనన్ ల మధ్య జరిగిన వాగ్వాదం ఈ విధంగా బయటపడింది!

కాగా ఈ విషయం తాజాగా కొందరి నోటి నుంచి బయటపడింది. ఈ చర్చ ఏవండోయ్ నాని గారు పాట పాడుతున్న సమయంలో జరిగిందట. ఇక జడ్జిమెంట్ విషయంలో మీమ్ స్టార్ థమన్, నిత్యా మీనన్ ల మధ్య కొంత సీరియస్ ఘర్షణ జరిగినట్లు ఆ షో టీం ద్వారా పలు వార్తలు బయటపడ్డాయి.

ఇక వీరిద్దరి మధ్య ఘర్షణను ఆ షో లో స్త్రీమ్ చేస్తారో లేదో.. వేచి చుడాల్సి ఉంది. ఇక ఈ వార్తల గురించి ఎస్ తమన్, హీరోయిన్ నిత్యామీనన్ లు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

- Advertisement -