Guppedantha manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక ఈ సీరియల్ లో రిషి వసుధార జంటకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇక ఈ సీరియల్ లో రిషి తల్లి పాత్రలో నటి జ్యోతి రాయి నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సీరియల్ లో ఈమె తన కొడుకులు తనని ద్వేషిస్తూ ఉన్నటువంటి పాత్రలో నటిస్తూ ఉంటారు. అయితే సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా జ్యోతి ఇందులో మనకు కనిపిస్తారు.
సాంప్రదాయంగా చీర కట్టుకొని ఆ కట్టు బొట్టు ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇలా ఈమె కట్టు బొట్టుతోనే తనకు ఎంతో మంది అభిమానులుగా మారిపోయారు. అయితే సీరియల్ లో ఇలా ఉన్న సోషల్ మీడియాలో జ్యోతి ఫోటోలు కనుక చూస్తే ఒక్కసారిగా షాక్ అవ్వాల్సిందే పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో గుప్పెడంత మనసు సీరియల్ లో నటించిన జగతేనా ఇక్కడ అనే ఆశ్చర్యం వ్యక్తం చేయక మానరు. అలా ఈమె గ్లామరస్ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అది తన ఇష్టం…
ఇలా జ్యోతి రాయ్ గ్లామరస్ ఫోటోలపై తాజాగా ఈ సీరియల్ లో రిషి పాత్రలో నటించినటువంటి ముఖేష్ గౌడ్ స్పందించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఆమె సీరియల్ లో ఎలాగ ఉందో బయట కూడా అలాగే ఉండాలని రూలేమీ లేదు అది పూర్తిగా తన వ్యక్తిగత విషయం ఆయన తనలో కూడా హీరోయిన్ క్యారెక్టర్ దాగి ఉందేమో అంటూ ఈయన ఆమె గ్లామరస్ ఫోటోలపై చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇక ఈ సీరియల్ గురించి మాట్లాడుతూ సీరియల్ టైమింగ్ మారడంతో సీరియల్ కి రేటింగ్ కూడా తగ్గిపోయిందనే విషయాన్ని ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఈ సీరియల్ మాత్రం మంచి రేటింగ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.