Health Tips: చాలామంది నాన్ వెజ్ ను తినటానికి ఇష్టపడుతూ ఉంటారు. పైగా నాన్ వెజ్ లో రకరకాల రుచులు దొరకటంతో వాటిని అస్సలు విడిచిపెట్టడం లేదు. ఇక నాన్ వెజ్ లో కొన్ని ప్రోటీన్స్, విటమిన్లు కూడా ఉన్నాయి. అలా అని వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రమాదాలు తప్పవంటున్నారు వైద్యనిపుణులు. ఏది తిన్న అది లిమిట్ లో ఉండాలి. అలా అని అతిగా తింటే అనారోగ్య సమస్యలు రావడం గ్యారెంటీ.
అయితే ప్రోటీన్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడతారు. నిజానికి ప్రోటీన్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే. కానీ ప్రోటీన్ కూడా లిమిట్ గానే ఉండాలి. లేదంటే ప్రమాదం. ముఖ్యంగా సంతానం గురించి ప్లాన్ చేసేవాళ్లు నాన్ వెజ్ ను బాగా తగ్గించాలి. ఇందులో ఉండే ప్రోటీన్ లెవెల్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తి సంతానం కలగకుండా చేస్తాయి.
ఎందుకంటే ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల పురుషుల్లో టెస్టోస్టెరాన్ 37% తగ్గుతుందని వైద్యులు తెలిపారు. దీనివల్ల పిల్లలను కనడం చాలా కష్టం అవుతుంది. కొన్ని సమయాలలో గుండె జబ్బులు, డయాబెటిస్, అల్జిమర్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రోటీన్ అమ్మోనియగా విచ్చినం కావడం వల్ల అది విషపూరితంగా మారుతుంది.
Health Tips: అధిక ప్రోటీన్ వల్ల లైంగిక సమస్యలు పెరుగుతాయి..
ఇక ఇది టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని తగ్గించి ఆ పాయిజన్ మొత్తం శరీరం అంతట వ్యాపిస్తుంది. ఇక తక్కువ టెస్టోస్టెరాన్ ఉండే వాళ్లకు వికారం, విరోచనాలు ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా లైంగిక కోరికల సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. కాబట్టి నాన్ వెజ్ ను ఎక్కువగా కాకుండా చాలావరకు తగ్గించాలి అని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. లేదంటే భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు తప్పవని అంటున్నారు. ఎక్కువగా మంచి పప్పు ధాన్యాలు వంటి పదార్థాలు తినడం వల్ల ఇటువంటి సమస్యలకు దూరం కావచ్చని తెలుస్తుంది.