Health Tips: మామూలుగా పండ్లు అనేవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. పండ్లను తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే పండ్లల్లో కావలసిన విటమిన్లు, పోషక విలువలు ఉంటాయి కాబట్టి. పండ్లను ముక్కలుగా కాకుండా, జ్యూస్ రూపంలో కూడా తీసుకుంటారు. అయితే పండ్లను సరైన పద్ధతిలో తీసుకోకపోతే పండ్లను తిన్న కూడా ఉపయోగం లేదు అని తెలుస్తుంది. అందుకు పండ్లను ఎలా తినాలి అనేది ఇప్పుడు చూద్దాం.
మొదట పండ్లను మిక్స్ చేసి తినేటప్పుడు పండ్ల కాంబినేషన్ అనేది సరిగా ఉండేలా చూసుకోవాలి. అంటే తీపి పండ్లను సిట్రిక్ పండ్లతో కలపకుండా తీసుకోవాలి. ఒకవేళ మిక్స్డ్ ఫ్రూట్స్ అయినా కూడా తీపి పండ్లను తినాలనుకుంటే తీపి పండ్లను మాత్రమే ఎంచుకోవాలి. లేదా పుల్లని పండ్లను తినాలి అంటే పుల్లని పండ్లను మాత్రమే ఎంచుకోవాలి. అలా కాకుండా తీపి, పులుపు పండ్లను కలిపి తినడం వల్ల జీర్ణ వ్యవస్థలో సమస్యలు ఎదురవుతాయి.
ఇక చాలామంది పండ్లను సహజంగా అనకుండా వాటిపై చాట్ మసాలాలు వేస్తూ తింటున్నారు. అలా వేసుకొని తినడం శరీరానికి మంచిది కాదు. పండ్లపై ఉప్పు, చాట్ మసాలా వేయడం వల్ల పండ్లల్లో ఉండే నీరు బయటికి వస్తుంది. ఇక ఆ నీరులో వివిధ పోషకాలు బయటికి వెళ్లిపోతాయి. ఇక ఆ చాట్ మసాలా శరీరంలోకి వెళ్లడం వల్ల కిడ్నీ సమస్యలు దరిచేరే అవకాశం ఉంది.
ఇక పండ్లు తినడానికి చాలామంది సమయాన్ని చూడరు. తమకు నచ్చినప్పుడల్లా పండ్లు తినాలని కోరుకుంటారు. అయితే చాలావరకు రాత్రి భోజనం తర్వాత పండ్లు తినడానికి ఇష్టపడుతుంటారు. ఇలా అసలు తినవద్దు అని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. తినడం వల్ల జీర్ణక్రియ పై ప్రభావం ఏర్పడుతుంది. పండ్ల లో ఉండే చక్కెర కంటెంట్ కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ లతో పులియబెట్టి జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిగా చేస్తుంది.
Health Tips:
భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత ఒక గంట తర్వాత పండ్లు తీసుకోవడం మంచిది. మామూలుగా పండ్లను తినే ముందు కడుగుతూ ఉంటాం. కొందరు పండ్లు కట్ చేసిన తర్వాత కూడా కడుగుతారు. అలా కడగటం వల్ల పండ్ల లో ఉండే విటమిన్లు, మినరల్స్ తొలగిపోతాయి. చాలా వరకు పండ్లను ఉదయం, మధ్యాహ్నం తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.