Health Tips: ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తీరిక లేని సమయంతో హడావుడి లైఫ్ తో గడిపేస్తున్నారు. కడుపు నిండా తినటానికి కూడా సమయం లేని పరిస్థితి వచ్చేసింది. ఎక్కడ చూసినా సంపాదన తప్ప మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకోలేకపోతున్నారు. దీంతో ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. సంపాదనలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు ఉద్యోగస్తులు. ఇప్పుడు అటువంటి వారికే కొన్ని ఆరోగ్య టిప్స్.
రోజును మంచి ఆరోగ్యంతో ప్రారంభించాలి అంటే ముందుగా.. వ్యాయామంతో మొదలు పెట్టాలి. ఉదయాన్నే లేవగానే రన్నింగ్, జాగింగ్ వంటివి చేయటం చాలా మంచిది. అలా క్రమం తప్పకుండా వ్యాయామాల ద్వారా రోజును ప్రారంభించాలి. ఇక వ్యాయామం తర్వాత కీలకమైనది బ్రేక్ ఫాస్ట్. బ్రేక్ ఫాస్ట్ అనేది చాలా ముఖ్యమైనది. వ్యాయామం చేసిన తర్వాత కచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి.
చాలావరకు నూనెతో చేసిన పదార్థాలు కాకుండా లైట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. అంతేకాకుండా మొలకలు, పండ్ల మొక్కలు, కీర ముక్కలు వంటివి కూడా తీసుకోవచ్చు. ఇక శరీరానికి మంచినీళ్లు చాలా అవసరం. దాహం లేకున్నా కూడా కొద్దిపాటు నీళ్లు తీసుకుని అలవాటు చేసుకోవాలి. మరీ తక్కువ నీరు, మరీ ఎక్కువ నీరు కాకుండా మూడు లీటర్ల నీటిని తాగితే మంచిది. ఇక బ్రేక్ ఫాస్ట్ తర్వాత నేరుగా లంచ్ కి రావాలి తప్ప మధ్యలో ఎటువంటి ఫుడ్ ని తీసుకోకూడదు.
ముఖ్యంగా జంక్ ఫుడ్ వాటికి దూరంగా ఉండాలి. కానీ పండ్లు తీసుకోవచ్చు. మధ్యాహ్నం చేసే లంచ్ లో హెవీగా తీసుకున్న పరవాలేదు. దీని వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. ఇక తీసుకునే లంచ్ లో కూడా ఆయిల్ తక్కువగా, మంచి పోషక పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా తిన్న వెంటనే పనిచేయకుండా కాస్త విశ్రాంతి తీసుకోవడం వల్ల మెదడు పనితీరు బాగుంటుంది. ఒత్తిడి అనేది దూరమవుతుంది.
ఆ తర్వాత సాయంత్రం చాలామందికి స్నాక్స్ తీసుకునే అలవాటు ఉంటుంది. స్నాక్స్ సమయంలో మంచి మంచి లైట్ పదార్థాలను తీసుకోవాలి. ఇక నైట్ డిన్నర్ చేసే సమయంలో మాత్రం హెవీ ఫుడ్ కాకుండా త్వరగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవడం మంచిది. రాత్రి సమయంలో లైట్ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరంకు అలసట అనేది ఉండదు. ఇదే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా దరి చేరవు.
Health Tips:
తిన్న వెంటనే పడుకోకూడదు. ఈ జనరేషన్ లో మాత్రం తిన్న వెంటనే అందరూ మొబైల్స్ పట్టుకొని బెడ్ ఎక్కుతుంటారు. ఇది చాలా ప్రమాదం. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక మొబైల్స్ కి దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా రాత్రి సమయంలో 8 గంటలు నిద్రించాలి. ఇలా ప్రతిరోజు చేయటం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు. అంతేకాకుండా చేసే పనిలో కూడా ఉత్సాహం పెరుగుతుంది.