Helath Tips: మన శరీరంలో అత్యంత సున్నితమైన అవయవాల్లో చెవి ఒకటి. చెవి నొప్పి వచ్చినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. ఈ సమస్య చలికాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. మిగతా కాలంలో కూడా ఈ సమస్యతో కొందరు బాధపడుతూ ఉంటారు. కపం బయటికి రాకుండా ఉండటం వల్ల చెవిలో ఏదైనా కీటకాలు దూరినప్పుడు, టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ వచ్చిన పంటి నొప్పి వలన కూడా చెవి నొప్పి లేదా చెవి పోటుకి దారితీస్తుంది. ఈ సమస్య ఒక్కొక్కసారి ఇంగ్లీష్ మందులకు లొంగదు. కానీ వీటికి ఆయుర్వేదంలో అద్భుతమైన చిట్కాలు ఉన్నాయంటున్నారు. ఇంతకూ అదేంటో చూద్దాం.
చెవి నొప్పికి ఆలివ్ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది అంటున్నారు వైద్యులు. ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ ని వేడి చేసి బాగా చల్లారనివ్వాలి. ఆ నూనెని నొప్పి ఉన్న చెవిలో వేస్తే ఉపశమనం కలుగుతుంది. చెవిలో బ్యాక్టీరియా, ఫంగస్ ఉంది అనిపించినప్పుడు మాత్రం టి ట్రీ ఆయిల్ ని ఉపయోగించడం మంచిదన్నారు. ఎందుకంటే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీసెప్టిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చెవి నొప్పిని తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే నేరుగా కాకుండా ఆలివ్ ఆయిల్ నువ్వుల నూనె కొబ్బరి నూనెలో ఒక్క చుక్క టీ ట్రీ ఆయిల్ వేయండి.
వీటిని బాగా మిశ్రమం చేసి ఒకటి నుంచి రెండు చుక్కల వరకు మాత్రమే చెవిలో వేసుకోండి. వాపుకి మరొక రకం చిట్కా చూద్దాం. దీనికోసం అల్లం వెల్లుల్లి బాగా పనిచేస్తాయి. ఒక మెత్తని గుడ్డలో వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు ఉప్పు వేసి నొప్పిగా ఉన్న చెవి దగ్గర ఉంచండి ఇలా చేయడం వల్ల త్వరగా ఉపశమనం లభిస్తుంది. అల్లం రసం పై పూత కూడా చెవి వాపుకి బాగా పనిచేస్తుంది.
చెవి నొప్పి ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం పొందటానికి తులసి కూడా ఒక మంచి ఔషధం ఇందులో యాంటీ మైక్రోబయల్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. తులసి ఆకులు నూరి ఆ రసాన్ని వడకట్టి నొప్పిగా ఉన్న చెవిలో వేయండి. సత్వర ఉత్సవం కనిపిస్తుంది. అలాగే లవంగం కూడా చెవి నొప్పికి మంచి ఔషధం ఇందులోని అనాల్జేసిక్ సమ్మేళనం ఉంటుంది.
Helath Tips:
ఇది పెయిన్ కిల్లర్ గా బాగా పనిచేస్తుంది. ఒక చెంచా నువ్వుల నూనెలో ఒక లవంగం వేసి మరిగించి దాన్ని వడగట్టి ఒకటి లేదా రెండు చుక్కల నూనె చెవిలో వెయ్యండి. దీనివల్ల కూడా సత్వర ఉపశమనం పొందవచ్చు. కానీ ఈ చిట్కాలు అన్ని సమస్య చిన్నదిగా ఉన్నప్పుడు మాత్రమే. నొప్పి భరించలేనిదిగా మారినప్పుడు వైద్యుల్ని సంప్రదించడం తప్పనిసరి.