Health Tips: స్నానం చేయడం అనేది మంచి అలవాటు. స్నానం చేయటం వల్ల శరీరం ఉల్లాసంగా ఉంటుంది. ఏ పని చేయడానికి అయినా సహకరిస్తుంది. ఇక రాత్రి సమయంలో కూడా స్నానం చేయడం మంచిదే. ఉదయం నుంచి చేసే పని ఒత్తిడిల వల్ల, ఇతర సమస్యల వల్ల ఇంటికి రాగానే రాత్రి సమయంలో స్నానం చేయటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది.
అయితే రాత్రి సమయంలో స్నానం చేయడం అనేది ఎంత ముఖ్యమో అది ఎప్పుడు చేస్తున్నాము అనేది కూడా అంతే ముఖ్యం. కొందరు భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తే.. మరి కొంతమంది భోజనంకు ముందు స్నానం చేస్తూ ఉంటారు. అయితే చాలామంది భోజనం చేసిన తర్వాత స్నానం చేసి విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు. కానీ అది ఏ మాత్రం మంచిది కాదు.
భోజనం చేసిన తర్వాత స్నానం చేయటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తడం ఖాయమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. భోజనం చేసిన వెంటనే స్నానం చేయటం వల్ల జీర్ణవ్యవస్థపై తీవ్రమైన ప్రభావం ఏర్పడుతుంది. అంతేకాకుండా కడుపునొప్పి, తిమ్మిరి వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో వాంతులు, అల్సర్, అసిడిటీ సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా ఇటువంటి సమస్యలు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల వస్తుంటాయి.
Health Tips:
అయితే తిన్న తర్వాత చల్లటి నీటితో స్నానం చేస్తే మంచిదే అని వైద్య నిపుణులు తెలిపారు. చల్లని నీటితో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో ఎటువంటి మార్పులు రావడమే కాకుండా జీర్ణక్రియ వ్యవస్థ కూడా సక్రమంగా ఉంటుంది. అంతేకాకుండా తీసుకున్న ఆహారంలో చెడు కొవ్వు కూడా కరుగుతుంది. అయితే తిన్న వెంటనే కాకుండా కనీసం 20 నిమిషాల తర్వాత స్నానం చేయడం మంచిది. కాబట్టి వెచ్చని నీటి కంటే చల్లని నీటికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.